శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 04, 2020 , 02:46:16

నేరాల నియంత్రణలో భేష్

నేరాల నియంత్రణలో భేష్

  • n  పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్  n  కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో
  •  సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ సిస్టం ప్రారంభం

కమాన్‌పూర్: పోలీస్ శాఖ పనితీరుతోనే స్వేచ్ఛాయుత వాతావరణం ఏర్పడుతుందని, నేరాల నియంత్రణలో పోలీస్‌శాఖ పనితీరు మెరుగుపడిందని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ ప్రశంసించారు. కమాన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రామగుండం కమిషనర్ సత్యనారాయణతో కలిసి సీసీ కెమెరాల కమాండ్ కంట్రో ల్ సిస్టమ్‌ను ప్రారంభించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలు అభినందనీయులన్నారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలతోపాటు కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడంలో సఫలీకృతులైన ఎస్‌ఐ శ్యామ్ పటేల్‌కు అభినందనలు తెలిపారు. సీఎం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. పోలీస్‌శాఖ పని తీరును మెరుగుపర్చేందుకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారని స్పష్టం చేశారు. కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ప్రశంసనీయమన్నారు. సమర్థవంతంగా విధు లు నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు సేవలందింస్తున్నారని, ఇకముందు కూడా ఇలాగే కొనసాగాలని సీపీ సత్యనారాయణ సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో ముందుకు సాగుతున్నామని వివరించారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, జిల్లాలోని ఇతర గ్రామాల ప్రజలు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను శాలువాలతో సన్మానించారు. మండలంలో 68 కెమెరాలను ఏర్పాటు చేయించిన ఎస్‌ఐ శ్యామ్ పటేల్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ రవీందర్, ఏసీపీ ఉమేందర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ సంజయ్, గోదావరిఖని టూటౌన్ సీఐ శ్రీనివాస్‌రావు, ఇతర పోలీస్ అధికారులు, ఎంపీపీ రాచకొండ లక్ష్మి, సర్పంచ్ నీలం సరిత, ఏఎంసీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ ఇనగంటి భాస్కర్‌రావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పిన్‌రెడ్డి కిషన్‌రెడ్డి, దాతలు పాల్గొన్నారు.     logo