మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 04, 2020 , 02:46:17

సంక్షేమ పథకాలతో ఎవుసం పండుగ

సంక్షేమ పథకాలతో ఎవుసం పండుగ

  • n  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 

మల్యాల: నాడు సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో చిన్నాభిన్నమైన వ్యవసాయం.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన పథకాలతో పండుగ లా మారింది అంటూ చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఉద్ఘాటించారు. అన్నదాతలు ఆత్మగౌరవంతో బతికేందుకే సర్కారు నియంత్రిత సాగుకు శ్రీకారం చుట్టిందన్నారు. రైతువేదికల నిర్మాణంతో రైతుల జీవితాల్లో సమూల మార్పులు రానున్నాయని చెప్పారు. మల్యాల మండలంలోని నూకపల్లి, మానాల, మల్యాల, తాటిపెల్లిలో రైతు వేదికల నిర్మాణానికి కలెక్టర్ రవితో కలిసి శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రూ.22 లక్షలు ఖర్చుచేసి నిర్మించనున్న రైతువేదికలు దేశానికే ఆదర్శంగా నిలువనున్నాయన్నారు. మెట్ట ప్రాంతమైన చొప్పదండి నియోజకవర్గం కాళేశ్వరం జలాలతో వాటర్ హబ్‌లా మారిందన్నారు. ఇప్పటికే రైతుల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపట్టిన ప్రభుత్వం, తాజా గా కల్లాల నిర్మాణాన్ని ప్రారంభించిందన్నారు. ఈ మేరకు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. కొండపోచమ్మ గండి విషయంలో ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం కలెక్టర్ రవి మాట్లాడుతూ జిల్లా వ్యా ప్తంగా 71 రైతు వేదికల నిర్మాణానికి ప్రభుత్వం ఉపాధిహామీ కింద రూ. 15.62కోట్లు మంజూరుచేసిందని వివరించారు. మూడు నెలల్లోగా నిర్మాణాలను పూర్తి చేస్తామని చెప్పారు. అధికారుల సూచనలు పాటించి నియంత్రిత విధానంలో పంటలు వేయాలని రైతులను కోరారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి మొక్క లు నాటారు. 

రాంపూర్ పంప్‌హౌస్ సందర్శన

రాంపూర్ పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యే పరిశీలించా రు. ఇంజినీరింగ్ శాఖాధికారులతో మాట్లాడారు. ఎస్సారెస్పీ పునర్జీవం పథకంలో భాగంగా నిర్జీవంగా ఉన్న వరద కాలువ 122 కిలోమీటర్ల మేర జీవనదిలా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఈఈ మనోహర్‌రెడ్డి, జడ్పీ సభ్యు డు కొండపలుకుల రాంమోహన్‌రావు, ఎంపీపీ మిట్టపల్లి విమల, మార్కెట్ కమిటీ చైర్మన్ జనగం శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, సహకార సంఘ అధ్యక్షుడు మధుసూదన్‌రావు, సాగర్‌రావు, రాంలింగారెడ్డి, సర్పంచులు బద్దం తిరుపతిరెడ్డి, గడికొప్పుల రమేశ్, మారంపల్లి సరోజన, గడ్డం జలజ, మొత్కు యాదమ్మ, నలువాల లక్ష్మి, ఎంపీటీసీలు పోతాని రవి, మారంపల్లి నర్సవ్వ, షఫియాబేగం, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అల్లూరి రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు కోటేశ్వర్‌రావు, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డి, అజారుద్దీన్, శ్రీనివాస్‌గౌడ్, రజని, అధికారులు పాల్గొన్నారు.


logo