ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 03, 2020 , 02:57:30

మానకొండూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్

మానకొండూర్‌లో స్వచ్ఛంద లాక్‌డౌన్

మానకొండూర్: మానకొండూర్‌లో కరోనా పాజి టివ్ కేసు నమోదు కావడంతో  గురువారం పం చాయతీ పాలకవర్గం అత్యవసరంగా సమావేశ మైంది. గ్రామంలో కరోనా విస్తరించకుండా అవససరమైన చర్యలు చేపడుతూ  శుక్రవారం నుంచి ఈనెల 17 వరకు (15 రోజుల పాటు) స్వచ్ఛం దంగా లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించింది. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో  లాక్‌డౌన్ కొనసాగించే విషయంపై  జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, ఎంపీడీవో భాస్కర్‌రావు,  తహసీల్దార్ రాజయ్య, వైద్యాధికారి సంధ్యారాణి, సీఐ సంతోష్ కుమార్, ఉపసర్పంచ్ నెల్లి మురళి,  ఎంపీటీసీ సభ్యులతో  చర్చించారు. అనంతరం నిర్ణయాన్ని వెలువరించినట్లు సర్పంచ్ రొడ్డ పృథ్వీరాజ్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని,  కిరాణ దుకాణాలు, వాటర్‌ప్లాంట్లు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మా త్రమే తెరిచి ఉంచాలని, ఉల్లంఘిస్తే రూ. 5వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు.   టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, సెలూన్లు నిబంధనలు పాటిం చాలని సూచించారు. 

నుస్తులాపూర్‌లో.. 

తిమ్మాపూర్ రూరల్: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో నుస్తులాపూర్ గ్రామ పంచాయతీ పాలకవర్గం బుధవారం స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిం చాలని తీర్మానించింది.  ఈ మేరకు గురువారం నుంచి దుకాణాలు, ఇతర వ్యాపార కేంద్రాలను  ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు   తెరిచి ఉంచాలని సర్పంచ్ రమేశ్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు. logo