బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 03, 2020 , 02:57:33

ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం

ఆకుపచ్చ తెలంగాణే కేసీఆర్ లక్ష్యం

  • n భావితరాల కోసమే హరితహారం
  • n ఉద్యమంలా మొక్కలు నాటాలి
  • n ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రామడుగు: ఆకుపచ్చ తెలంగాణ ఏర్పాటే సీఎం కేసీఆర్ లక్ష్యమని   ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం వెలిచాల శివారులోని రొడ్డాం వద్ద వంతెనకు ఇరువైపులా అప్రోచ్ సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గురువారం ఆయన శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం  స్థానిక దుర్గమ్మగడ్డలో ప్రజాప్రతినిధులతో కలిసి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భావితరాలకు బంగారు భవిష్యత్ అందించడానికే రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు అడవులను పట్టించుకోకపోవడంతో అంతరించిపోయాయన్నారు. దీంతో అటవీ సంపదే కాకుండా జంతుజాలం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టాలన్న సంకల్పంతో గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగునీటి కష్టాలు తీర్చిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. నియోజకవర్గంలో హరితహారం ఉద్యమంలా చేపట్టాలని  పిలుపు నిచ్చారు.  ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీర్ల సరోజన, ఎంపీపీ కలిగేటి కవిత, జడ్పీ కోఆప్షన్ ఎండీ శుక్రొద్దీన్, పీఆర్ ఏఈ సచిన్, ఉప సర్పంచ్ పూదరి వెంకటేశ్, ఏఎంసీ చైర్మన్ గంట్ల వెంకటరెడ్డి, ఆర్‌బీఎస్ మండల కోఆర్డినేటర్ జూపాక కరుణాకర్, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, మాజీ మండలాధ్యక్షుడు మార్కొండ కిష్టారెడ్డి, మాజీ సర్పంచ్ వీర్ల రవీందర్‌రావు, మాజీ ఎంపీటీసీ బండపెల్లి యాదగిరి, దేశరాజ్‌పల్లి ఎంపీటీసీ వంచ మహేందర్‌రెడ్డి, నాయకులు కలిగేటి లక్ష్మణ్, గజ్జెల ఆనందరావు, వీర్ల సంజీవరావు, లోకిని స్వామి, చిరుత జగన్, శ్రీనివాస్‌గౌడ్, కొత్తూరి నారాయణ, తదితరులు పాల్గొన్నారు. 


logo