శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 03, 2020 , 02:57:34

సమ్మె సక్సెస్..

సమ్మె సక్సెస్..

  • n  ఆర్జీ-1, ఆర్జీ-2, ఆర్జీ-3, ఏపీఏ డివిజన్లలో సమ్మె సంపూర్ణం
  • n  సహకరించిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపిన టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత, అధ్యక్షుడు వెంకట్రావ్, నాయకులు
  • n  బోసిబోయిన ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు

గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం రీజియన్‌లో టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు తలపెట్టిన సమ్మె మొదటి రోజు విజయవంతమైంది. రామగుండం-1 డివిజన్ పరిధిలోని జీడీకే-1, 2, 2ఏ, మేడిపల్లి ఓసీపీ ఇతర గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ వంటి విధానాలను నిరసిస్తూ తలపెట్టిన సమ్మెకు కార్మికులు సంపూర్ణంగా సహకరించారు. గురువా రం మొదటి షిప్టుకు కార్మికులు హాజరుకాకుండా తమ నిరసన తెలిపారు. బొగ్గు గనులపై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు, జాతీయ కార్మిక సంఘాల నాయకులు సమ్మె విజయవంతం కోసం కృషి చేశారు. జీడీకే-1వ గనిపై జరిగిన కార్యక్రమంలో టీబీజీకేఎస్ నా యకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు జావిద్ పాషా, పెద్దపల్లి సత్యనారాయణ, ఆర్జీ-1 ఉపాధ్యక్షుడు గండ్ర దామోదర్ రావు, ఎట్టం కృష్ణ, కృష్ణమూర్తి, మండ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అన్ని బొగ్గు గనులపై టీబీజీకేఎస్ నాయకులు నిరనస తెలియజేశారు. శుక్ర, శనివారం రోజుల్లో  కూడా సమ్మెను విజయవంతం చేయాలని జాతీయ సంఘాల నాయకులు కోరారు. టీబీజీకేఎస్ నుంచి ఒకరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. సమ్మె సందర్భంగా గనులన్నీ బోసిపోయాయి. మేడిపల్లి ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు టీబీజీకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. దేశ వ్యాప్తంగా బొగ్గు గని కార్మికులు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ సమ్మెలోకి వెళ్లారని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సమ్మె విజయవంతం చేసిన కార్మికులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.  

యైటింక్లయిన్ కాలనీ: రామగుండం-2 డివిజన్‌లో సమ్మె  సంపూర్ణంగా జరిగింది. ఆర్జీ-2 పరిధిలోని జీడీకే-7 ఎల్‌ఈపీ, వకీల్‌పల్లి, ఓసీపీ-3 ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది. ఉదయం షిఫ్టు నుంచే కార్మికులెవరూ విధులకు హాజరుకాలేదు. దీంతో ఆయా బొగ్గు గను లు బోసిపోయి కనిపించాయి. మొదటి రోజు సమ్మె కారణంగా ఆర్జీ-2లోని భూగర్భ, ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తికి భారీ నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. కాగా, సమ్మె సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గోదావరిఖని టూటౌన్ పోలీసులు గనుల వద్ద బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉంటే జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్ యూనియన్ నాయకులు వేర్వేరుగా గనులపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టీబీజీకేఎస్ నాయకులు గనులపై మాట్లాడుతూ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు అన్ని గనులు, డిపార్ట్‌మెంట్లపై సమ్మె విజయవంతం చేసినట్లు తెలిపారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులకు టీబీజీకేఎస్ ఆర్జీ-2 ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాస్, దేవ వెంకటేశం, సత్యనారాయణరెడ్డి, బేతి చంద్రయ్య, నాయిని మల్లేశ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్యారేమియా, సత్యం, రాజేశం, కర్క శ్రీనివాస్, ఆకుల రాజయ్య, రవీందర్ తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.

రామగిరి : ఆర్జీ-3, ఏపీఏ డివిజన్‌లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. ఆర్జీ-3లోని ఓసీపీ-1, 2, ఏపీఏలోని అడ్రియా ల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో కార్మికులు స్వచ్ఛందంగా సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జీ -3 గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు గౌతం శంకరయ్య మా ట్లాడారు. జాతీయ కార్మిక సంఘాల నాయకులు కార్మికుల పట్ల ద్వంద వైఖరిని అవలంభిస్తున్నట్లు దుయ్యబట్టారు. తమ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు సమ్మెకు కార్మికులు సంపూర్ణ మద్దతు ప్రకటించి విధులకు హాజరుకాలేదన్నారు. జాతీయ కార్మిక సంఘాల నేతలు సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఆ యూనియన్లకు చెందిన కార్మికులను విధులకు పంపారని ఆరోపించారు.  టీబీజీకేఎస్ ఇచ్చి న పిలుపు మేరకు సమ్మెలో పాల్గొన్న కార్మికులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పర్స బక్కయ్య యాదవ్, జక్కుల దామోదర్, దేవ శ్రీనివాస్, పేర్కారి నాగేశ్వర్‌రావు, వేముల రవిశంకర్‌గౌడ్, దాసరి మల్లేశ్, జయపాల్‌రెడ్డి, రామారావు, ఉప్పుల వెంకటేశ్వర్, రహిమొద్దీన్, దీటి సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.


logo