మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jul 02, 2020 , 03:41:39

కరోనాపై అక్షర సమరం పుస్తకావిష్కరణ

కరోనాపై అక్షర సమరం పుస్తకావిష్కరణ

కరీంనగర్ కల్చరల్: కరోనా వ్యాపిస్తున్నందున  ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ కోరారు. డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ రాసిన కరోనాపై అక్షర సమరం పుస్తకాన్ని అదనపు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై ప్రజలకు అవగాహన వచ్చేలా కవితలు రాసిన  కవులను అభినందించారు. సాహితీ గౌతమి అధ్యక్ష, కార్యదర్శులు గండ్ర లక్ష్మణ్‌రావు, గాజుల రవీందర్, రచయిత అన్నవరం దేవేందర్, రుద్రారం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మోహన్, రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శంకర్,  ప్రభాకర్ పాల్గొన్నారు. 


logo