సోమవారం 06 జూలై 2020
Karimnagar - Jun 30, 2020 , 02:35:18

గ్రామాల అభివృద్ధికి కృషి

గ్రామాల అభివృద్ధికి కృషి

  • n జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు
  • n  తిమ్మాపూర్‌లో సీసీ రోడ్డు     
  •        నిర్మాణానికి భూమిపూజ

ఎల్లారెడ్డిపేట: గ్రామాల సమగ్రాభివృద్ధికి మంత్రి కేటీఆర్ సహకారంతో కృషి చేస్తామని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు పేర్కొన్నారు. ఎంపీపీ పిల్లి రేణు క, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్యతో కలిసి సోమవారం ఆయన తిమ్మాపూర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈజీఎస్ నిధులు రూ.12లక్షలతో పనులు ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఇందులో ఏఎంసీ చైర్మన్ గుళ్లపల్లి నర్సింహారెడ్డి, సర్పంచ్ పడిగెల రవీందర్, ఎంపీటీసీ వరద బాబు, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అందె సుభాష్, నాయకులు దేవయ్య, సీత్యానాయక్, సతీశ్, సురేశ్, భీమేశ్ తదితరులు ఉన్నారు.


logo