మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 30, 2020 , 02:35:19

రైతును రాజును చేయడమే లక్ష్యం

రైతును రాజును చేయడమే లక్ష్యం

  • అభివృద్ధి పనుల భూమిపూజలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

రామడుగు : తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజుగా చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం శ్రీరాములపల్లిలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అనతికాలంలోనే రైతులకు సాగునీటిని అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విజయం సాధించిందన్నారు.  పొలాలవద్దనే కల్లాలు నిర్మించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 750 కోట్ల నిధులను కేటాయించడం అభినందనీయం అన్నారు. రైతుబంధు అందని రైతులు ఎవరైనా ఉంటే సంబంధిత వ్యవసాయ అధికారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరేలా చూడాలన్నారు. అనంతరం మహిళలకు మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీపీ కలిగేటి కవిత, ఎంపీడీవో సతీశ్‌రావు, ఏపీవో చంద్రశేఖర్, మార్కెట్‌కమిటీ చైర్మన్ గంట్ల వెంకట్‌రెడ్డి, సర్పంచ్ సంటి జీవన్, ఎంపీటీసీ మోడీ రవీందర్, టీఆర్‌ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

శ్యాంసుందర్‌రెడ్డికి న్యాయం చేస్తాం

తెలంగాణ ప్రభుత్వం సైనికులకు అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. రామడుగు మండలం గోపాల్‌రావుపేటకు చెందిన మాజీ సైనికుడు శ్యాంసుందర్‌రెడ్డి నివాసాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. బాధితుడి భూమికి పట్టా సమస్య ఉందని తెలిసి తహసీల్దార్లతో మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఇక్కడ ఏనుగు రవీందర్‌రెడ్డి, తదితరులు ఉన్నారు. 


logo