సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 29, 2020 , 00:59:40

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ

ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు పీవీ

కార్పొరేషన్‌: నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి మేయర్‌ వై సునీల్‌రావు పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ ముఖ్యమంత్రిగా రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దేశంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌-కరీంనగర్‌ రాజీవ్‌ రహదారి, ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ నిర్మాణానికి పునాది రాయి వేసిన మహనీయుడు అని పేర్కొన్నారు. పెద్దపల్లి-నిజామాబాద్‌ రైల్వేలైన్‌కు కృషి చేశారన్నారు. నగరంలో పీవీ విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్‌ మాధవి, నగరపాలక అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

కార్పొరేషన్‌: నగరంలోని కరీంనగర్‌ డెయిరీలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పీవీ విగ్రహానికి డెయిరీ చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీవీ బహుభాషా కోవిదుడని పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డెయిరీ ఎండీ పీ శంకర్‌రెడ్డి, డైరెక్టర్లు ఎం ప్రభాకర్‌ రావు, సలహాదారు హన్మంతరెడ్డి, జనరల్‌ మేనేజర్‌ ప్రభాకర్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో..

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్‌ వ్యాప్తంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలు నిర్వహించారు. కమిషనరేట్‌ కేంద్రంలో పీవీ చిత్రపటానికి సీపీ పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. భారత దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న మహోన్నతుడు పీవీ అని కొనియాడారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఆయన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జన్మించడం మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీలు ఎస్‌ శ్రీనివాస్‌ (ఎల్‌అండ్‌వో), జీ చంద్రమోహన్‌(పరిపాలన), ఏసీపీ మదన్‌లాల్‌, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, ఆర్‌ఐలు మల్లేశం, జానీమియా, మురళి, శేఖర్‌, ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌, నటేశ్‌, సీపీవో కార్యాలయం(పరిపాలన) అధికారులు, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు. కరీంనగర్‌ రూరల్‌, టౌన్‌, హుజూరాబాద్‌, కరీంనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీ కార్యాలయాల్లో పీవీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఏసీపీలు పీ అశోక్‌, విజయసారథి, ఎస్‌ శ్రీనివాసరావు, శంకర్‌రాజు, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు. కమిషనరేట్‌ పరిధిలోని కరీంనగర్‌ వన్‌ టౌన్‌, టూ టౌన్‌, త్రీ టౌన్‌, కరీంనగర్‌ రూరల్‌, గంగాధర, రామడుగు, గన్నేరువరం, కేశవపట్నం, సైదాపూర్‌, కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్లలో పీవీ శత జయంతి వేడుకలు నిర్వహించారు. సీఐలు విజయ్‌కుమార్‌, లక్ష్మణ్‌బాబు, విజ్ఞాన్‌రావు, తుల శ్రీనివాసరావు, ఎస్‌ఐలు వివేక్‌, గొల్లపల్లి అనూష, తిరుపతి, వివేక్‌, వీ రవి, ప్రశాంత్‌, ఎల్లయ్యగౌడ్‌, వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు.  సిటీ పోలీస్‌ శిక్షణ కేంద్రం(సీపీటీసీ)లో నిర్వహించిన పీవీ శత జయంతి ఉత్సవాల్లో వైస్‌ ప్రిన్సిపాల్‌ శివభాస్కర్‌, ఇండోర్‌, అవుట్‌డోర్‌ విభాగాల ఇన్‌చార్జీలు నాగేందర్‌, కిరణ్‌కుమార్‌,  వివిధ విభాగాల పోలీసులు పాల్గొన్నారు. అలాగే, పోలీస్‌ శిక్షణ కేంద్రం(పీటీసీ)లో నిర్వహించిన వేడుకల్లో డీసీపీ చంద్రయ్య, ఇండోర్‌(పరిపాలన) ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ హనోక్‌, ఆర్‌ఐలు రమేశ్‌, సురేశ్‌, విష్ణుప్రసాద్‌, త్రిముక్‌, శ్రీనివాస్‌, వివిధ విభాగాల పోలీసులు, తదితరులు పాల్గొన్నారు. 

కొత్తపల్లి: జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పీవీ చిత్రపటానికి సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి పూల మాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బహుభాషా కోవిదుడు, ఆర్థికవేత్త పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహిస్తుండడం అసలైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో గంగాధర సింగిల్‌ విండో చైర్మన్‌ బాలాగౌడ్‌, చింతకుంట ఎంపీటీసీ తిరుపతి నాయక్‌, టీఆర్‌ఎస్వీ కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షుడు కిమ్‌ ఫహాద్‌, వెలిచాల మాజీ ఎంపీటీసీ యాదగిరి, రవితేజ, సాయి, వర్మ, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 

కొత్తపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో...

కొత్తపల్లి మున్సిపల్‌ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి చైర్మన్‌ రుద్ర రాజు పూలమాల వేసి, నివాళులర్పించారు. పీవీ శత జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జేరిపోతుల మొండయ్య, మనుపాటి వేణుగోపాల్‌, నాయకులు బండ గోపాల్‌రెడ్డి, ఎస్‌కే బాబా, కట్ల సుధాకర్‌, సుంకె సత్యం, రమేశ్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

తెలంగాణ జాగృతి కార్యాలయంలో...

హౌసింగ్‌బోర్డుకాలనీ: తెలంగాణ జాగృతి కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్‌ పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి పీఆర్వో గాలిపెల్లి రత్నాకర్‌చారి, దొంతినేని అభిరామ్‌రావు, వినయ్‌, బన్ని, అఖిల్‌, మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. 

తెలంగాణచౌక్‌: నగరంలోని తెలంగాణచౌక్‌లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను టీఆర్‌ఎస్‌, కులసంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి పీవీ నరసింహారావు చేసిన సేవలను కొనియాడారు. పీవీ శత జయంతి వేడుకలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏడాది పాటు నిర్వహించనున్నట్లు ప్రకటించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు జీఎస్‌ ఆనంద్‌, మాజిత్‌, శ్రీనివాస్‌ పటేల్‌, ఉద్యోగ సంఘం నాయకులు శ్యామల, యుగంధర్‌, నారాయణగౌడ్‌, సత్యనారాయణ, ఎండీ అక్బర్‌, సంజీవరావు, తదితరులు పాల్గొన్నారు.


తాజావార్తలు


logo