ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 28, 2020 , 02:59:31

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

  • n కలెక్టర్ శశాంక
  • n  అన్నారం, ఈదులగట్టెపల్లిలో హరితహారం

మానకొండూర్ రూరల్: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కలెక్టర్ శశాంక సూచించారు. మానకొండూర్ మండలం అన్నారం, ఈదులగట్టెపల్లి గ్రామాల్లో శనివారం ఆయన హరితహారంలో భాగంగా సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావుతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నాటిన ప్రతి మొక్కనూ బాధ్యతగా సంరక్షించాలని కోరారు. మొక్కలు పర్యావరణాన్ని కాపాడుతాయని, భావితరాలకు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు.  అంతకు ముందు ఈదులగట్టెపల్లిలో  కమ్యూనిటీ ప్లాంటేషన్‌లో భాగంగా మొక్కలు నాటారు. మొక్కలకు నీళ్లు పట్టడానికి ట్రాక్టర్ రావాలంటే ఇబ్బందిగా ఉన్నందున నరేగాలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్థలంలో మంకీఫుడ్ కోర్టు ఏర్పాటు చేసినట్లయితే కోతులు ఇండ్లల్లోకి రాకుండా ఉంటాయని తెలిపారు. గ్రామంలో చేపడుతున్న వైకుంఠధామం నిర్మాణ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శేఖర్ గౌడ్, ఎంపీపీ ముద్దసాని సులోచన, సర్పంచులు సరిత, కిషన్, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో భాస్కర్‌రావు, తహసీల్దార్ రాజయ్య, డీఈవో దుర్గాప్రసాద్, ఏపీడీ మంజులాదేవి, అటవీ శాఖ అధికారులు సరిత, ఖలీం, ఏపీవో రాధ, ఎంఈవో మధుసూదనాచారి, పాఠశాల హెచ్‌ఎం శైలజ, ఆర్‌ఐ సోనియా, వీఆర్వో లత, వార్డు సభ్యులు, ఎస్‌ఎంసీ చైర్మన్ పురం అనిల్, తదితరులు పాల్గొన్నారు.


logo