మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 28, 2020 , 02:59:47

హరిత జాతర

హరిత జాతర

  • l మూడోరోజూ ఉత్సాహంగా హరితహారం 
  • l పాల్గొన్న మంత్రి కొప్పుల, ఎమ్మెల్యేలు, అధికారులు, ప్రజాప్రతినిధులు
  • l ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాటిన 1,12,475 మొక్కలు
  • కరీంనగర్, నమస్తే తెలంగాణ:   కరీంనగర్ ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా ఆరో విడుత హరితహారం కార్యక్రమం మూడో రోజూ శనివారం ఉత్సాహంగా సాగింది. ఎక్కడ చూసినా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటారు. నాలుగు జిల్లాల్లో లక్షా 12 వేల 475 మొక్కలు నాటి నీరు పోశారు. కాగా, రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్, జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఈస్రాజ్‌పల్లి, జగిత్యాల జిల్లా కేంద్రంలో మొక్కలు నాటారు. ప్రతిఒక్కరూ హరితహారంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. కోరుట్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మొక్కలు నాటి నీరు పోశారు. కరీంనగర్ కలెక్టర్ శశాంక సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావుతో కలిసి మానకొండూర్ మండలం ఈదులగట్టపల్లిలో ఐదెకరాల్లో పెంచుతున్న కమ్యూనిటీ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అన్నారంలో మొక్కలు నాటారు. మంకీ ఫుడ్‌కోర్టుల ఏర్పాటుపై దృష్టిపెట్టాలని సూచించారు. గంగాధర మండలం రంగపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే వేములవాడ పట్టణంతోపాటు బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌లో, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లతో కలిసి అధ్యక్షురాలు జిందం కళ మొక్కలు నాటి, నీరు పోశారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సిక్తాపట్నాయక్, కమిషనరేట్ ఆవరణలో సీపీ సత్యనారాయణ, ముత్తారం మండలం మైదంబండలో జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మొక్కలు నాటారు. కాగా, శనివారం కరీంనగర్ జిల్లాలో 19,661, రాజన్న సిరిసిల్లలో 38,871, జగిత్యాలలో 21,290, పెద్దపల్లిలో 32, 653ల మొక్కలు నాటినట్లు అధికారులు తెలిపారు.


logo