ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 26, 2020 , 01:22:22

పర్యావరణాన్ని రక్షించుకోవాలి

పర్యావరణాన్ని రక్షించుకోవాలి

l  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

l మానకొండూర్‌ ఎమ్మెల్యే  రసమయి బాలకిషన్‌

l తిమ్మాపూర్‌, గన్నేరువరం మండలాల్లో హరితహారం ప్రారంభం

తిమ్మాపూర్‌ రూరల్‌/ గన్నేరువరం: పర్యావరణాన్ని రక్షించుకోవాలని.. అందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పిలుపునిచ్చారు. ఎల్‌ఎండీ కాలనీలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతోపాటు తిమ్మాపూర్‌లోని కేజీబీవీ, మహాత్మానగర్‌, పోలంపల్లి, నర్సింగాపూర్‌, గన్నేరువరం మండలం గుండ్లపల్లి, హన్మాజీపల్లిలో ఆయన మొక్కలు నాటి, హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 2లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు తెలిపారు. దీనిని చేరుకోవడంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కార్యక్రమాల్లో ఎస్సారెస్పీ సీఈ శంకర్‌, ఎంపీపీ కేతిరెడ్డి వనిత, వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, తహసీల్దార్‌ రాజ్‌కుమార్‌, ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, సర్పంచులు జక్కని శ్రీవాణి, బొజ్జ తిరుపతి, తోట మమత, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఇనుకొండ జితేందర్‌రెడ్డి, దుండ్ర రాజయ్య, జక్కని రవీందర్‌, ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

శ్మశాన వాటిక పనుల పరిశీలన

గన్నేరువరం మండలం గుండ్లపల్లి గ్రామంలో నిర్మిస్తున్న శ్మశాన వాటిక పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అతి తక్కువ సమయంలో అన్ని హంగులతో శ్మశాన వాటిక పనులు పూర్తి చేసిన సర్పంచ్‌ బేతెల్లి సమత, నాయకుడు బేతెల్లి రాజేందర్‌రెడ్డిని అభినందించారు. హన్మాజీపల్లి గ్రామంలో వారసంత నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, జిల్లా ఆర్‌బీఎస్‌ కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, మండల కోఆర్డినేటర్‌ బోడ మాధవరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్‌రావు, మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు తీగల మోహన్‌రెడ్డి, ప్రత్యేకాధికారి వెంకటేశం, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, తహసీల్దార్‌ బండి రాజేశ్వరి, ఎంపీవో నర్సింహారెడ్డి, సర్పంచులు బేతెల్లి సమత, లింగాల రజిత, నాయకులు  పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన నాయకులు

మైలారం టీఆర్‌ఎస్‌ గ్రామాధ్యక్షుడిగా నియామకమైన జక్కనపెల్లి వేణు, టీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా మండల కోఆర్డినేటర్‌ నియామకమైన సాంబయ్యపల్లి గ్రామానికి చెందిన జీల కుమార్‌ యాదవ్‌ గురువారం ఎల్‌ఎండీలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని ఘనంగా సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట టీఆర్‌ఎస్‌ నాయకులు తోట కోటేశ్వర్‌, మాజీ సర్పంచ్‌ గువ్వ వీరయ్య, మర్రి వెంకటమల్లు, వరాల పరశురాములు, వరాల మల్లేశం, నూకల తిరుపతి తదితరులు ఉన్నారు.


logo