శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 25, 2020 , 01:28:21

మంత్రి కేటీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు

మంత్రి కేటీఆర్‌ పర్యటనకు ఏర్పాట్లు

వీర్నపల్లి : మంత్రి కేటీఆర్‌ శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య బుధవారం ఏర్పాట్లను పరిశీలించారు. భూక్యాతండా, బావుసింగ్‌తండా, మద్దిమల్ల తండాలో మంత్రి ప్రారంభించే వంతెనలను పరిశీలించి అధికారులు, నాయకులకు పలు సూచనలు చేశారు. రంగంపేటలో పట్టాల పంపిణీ కార్యక్రమ సభాస్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు చాంద్‌పాషా, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు సాగర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, బంజారా సంఘం జిల్లా అధ్యక్షుడు సురేశ్‌నాయక్‌, ఏఎంసీ వైస్‌చైర్మన్‌ రాజేశ్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మాన్‌, ఏఎంసీ డైరెక్టర్‌ రఫీ, సర్పంచ్‌ లింగం ఉన్నారు.

అర్బన్‌ లంగ్స్‌స్పేస్‌ పార్క్‌ స్థల పరిశీలన

ఎల్లారెడ్డిపేట: మండలం పరిధిలో ఈ నెల 26న మంత్రి కేటీఆర్‌  శంకుస్థాపన చేయనున్న అర్బన్‌ లంగ్స్‌ స్పేస్‌ పార్కు స్థలాన్ని బుధవారం ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఎకరాల విస్తీర్ణంలో పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజలకు ఆహ్లాదాన్ని, స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్‌ గుళ్లపల్లి నర్సింహరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వర్స కృష్ణహరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి, ఆర్బీఎస్‌ మండల కన్వీనర్‌ రాధారపు శంకర్‌ తదితరులు ఉన్నారు. logo