సోమవారం 28 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 25, 2020 , 01:14:52

రైతులు కల్లాలు నిర్మించుకునేలా చూడాలి

రైతులు కల్లాలు నిర్మించుకునేలా చూడాలి

గంగాధర: రైతులు ధాన్యం ఆరబెట్టుకోవడానికి పొలాల వద్ద కల్లాలు నిర్మించుకునేలా అవగాహన కల్పించాలని ఏపీడీ మంజులాదేవి సూచించారు.  మండల పరిషత్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉపాధి పనులు, హరితహారంపై వ్యవసాయ శాఖ, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ రైతులు 50, 60, 75 మీటర్లలో కల్లాలు నిర్మించుకోవడానికి అవకాశం ఉందన్నారు. పొలం గట్లపై టేకు, మలబార్‌ వేప, నీలగిరి వంటి మొక్కలు నాటేలా ఏఈవోలు ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ భూములను గుర్తించి విరివిగా మొక్కలు నాటాలన్నారు. హరితహారం లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఆదేశించారు. ఉపాధి హామీ కింద గుంతలు తీయించాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో నర్సయ్య, ఏవో రాజు, ఎంపీవో జనార్దన్‌రెడ్డి, ఏపీవో రాణి, ఏఈవోలు, ఉపాధిహామీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


logo