మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 24, 2020 , 01:39:44

కంగ్రాట్స్‌ లహరి..

కంగ్రాట్స్‌ లహరి..

n  ఇంటర్‌ ఫస్టియర్‌ సీఈసీలో  స్టేట్‌ టాపర్‌గా కస్తూర్బా విద్యార్థిని

n  ఫోన్‌ ద్వారా అభినందించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం   ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ 

సిరిసిల్ల రూరల్‌: ఇంటర్‌ ఫస్టియర్‌ సీఈసీలో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన తంగళ్లపల్లి కేజీబీవీ విద్యార్థిని వడ్డెపల్లి లహరిని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ అభినందించారు. లహరి 500 మార్కులకు 482 సాధించింది. ఈ మేరకు మంగళవారం కేజీబీవీ ప్రత్యేకాధికారి శ్యామలతో ఫోన్‌లో మాట్లాడారు. మంచి ఫలితాలు సాధించా            రని, సెకండియర్‌లోనూ లహరి ఇదే ప్రతిభచూపేలా ప్రోత్సహించాలని సూచించారు. ద్వితీయ సంవత్సరంలోనూ మంచి మార్కులు సాధిస్తే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఢిల్లీలోని సీఏ కళాశాలలో సీటు ఇప్పించి, చదివిస్తామని చెప్పినట్లు ప్రత్యేక అధికారి శ్యామల పేర్కొన్నారు. కాగా, లహరిని జిల్లా విద్యాధికారి రాధాకిషన్‌ ప్రశంసించారు. మంగళవారం తన కార్యాలయానికి వచ్చిన లహరికి జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.  logo