శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 19, 2020 , 02:28:31

హరితహారంలో భాగస్వాములవ్వాలి

హరితహారంలో భాగస్వాములవ్వాలి

  •   n ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌
  •   n మొక్కల పెంపకంపై ప్రజాప్రతినిధులు,   అధికారులకు అవగాహన

గంగాధర: నియోజకవర్గంలో ఈనెల 20వ తేదీ నుంచి చేపట్టే హరితహారంలో ప్రతి ఒక్కరూ   భాగస్వాములై విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపు నిచ్చారు. మండలంలోని కురిక్యాలలో గురువారం హరితహారంపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటడంతో పాటు ప్రజలు నాటేలా ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు  కృషి చేయాలని సూచించారు.  గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, అదనపు పీడీ వెంకటేశ్వర్లు, ఏపీడీ మంజులాదేవి, తహసీల్దార్‌ జయంత్‌, ఎంపీడీవో నర్సయ్య, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కోఆర్డినేటర్‌ పుల్కం గంగన్న, వైస్‌ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

ఉద్యమంలా చేపట్టాలి

రామడుగు: నియోజకవర్గంలో హరితహారం ఉద్యమంలా చేపట్టాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పిలుపు నిచ్చారు. మండలంలోని షానగర్‌లో గల ఓ గార్డెన్స్‌లో హరితహారంపై అవగాహన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.   హరితహారంలో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి పౌరుడూ ఐదు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. రహదారి పక్కన విద్యుత్‌ స్తంభాల కింద మొక్కలు నాటకుండా చూసుకోవాలన్నారు.  నియోజకవర్గంలో నీటి వనరులు అందుబాటులో ఉన్నాయని, పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి కాపాడుకుందామని పిలుపు నిచ్చారు. ఇక్కడ ఎంపీపీ కలిగేటి కవిత, తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీష్‌రావు, ఎంఈవో అంబటి వేణుకుమార్‌, ఎస్‌ఐ అనూష, అటవీశాఖ అధికారులు, ఏపీవో చంద్రశేఖర్‌, వైస్‌ ఎంపీపీ పూనెల్ల గోపాల్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.logo