శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 18, 2020 , 00:29:20

పేదల వైద్యానికి సర్కారు అండ

పేదల వైద్యానికి సర్కారు అండ

  • రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

గోదావరిఖని:  ఆపదలో ఉన్న నిరుపేదలకు  తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ అన్నారు.  సీఎం కేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని పేర్కొన్నారు.   గోదావరిఖని పరశురాంనగర్‌కు చెందిన విజ య గుండె ఆపరేషన్‌ కోసం రూ.1.50 లక్షల  ఎల్వోసీని బుధవారం హైదరాబాద్‌లో అందజే శారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ  ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అనేక పథకాలను అమలు చేస్తున్నదన్నారు. ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు.


logo