శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 18, 2020 , 00:27:31

అభివృద్ధిని చూసే పార్టీకి ఆదరణ

అభివృద్ధిని చూసే పార్టీకి ఆదరణ

n చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌

n 100 మందితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరిన యూత్‌ కాంగ్రెస్‌ నేత గోవర్ధన్‌

n కండువాకప్పి ఆహ్వానించిన సుంకె

 బోయినపల్లి: సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో టీఆర్‌ఎస్‌ పార్టీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌   ఉద్ఘాటించారు.నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కట్ట గోవర్ధన్‌ 100 మందితో కలిసి బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరగా సుంకె గులాబీ కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పార్టీలో చేరిన యువతకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందన్నారు. గోవర్ధన్‌ మాట్లాడుతూ పథకాలను చూసే టీఆర్‌ఎస్‌లోకి వచ్చానని చెప్పారు.  కార్యక్రమంలో  టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మేడుదుల మల్లేశం,మల్లాపూర్‌ ఎంపీటీసీ సభ్యురాలు ఐరెడ్డి గీతా, కో-ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అజ్జు, మాన్వాడ ఉప సర్పంచ్‌ ఎల్లారెడ్డి, నేతలు అనుముల భాస్కర్‌,ఐరెడ్డి మల్లారెడ్డి ఉన్నారు.

సహకార సంఘాల బలోపేతానికి కృషి..

గంగాధర: నియోజకవర్గంలోని సహకార సంఘా ల బలోపేతానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేరొన్నారు.  గంగాధర సింగిల్‌ విండో కార్యాలయంలో నిర్మించిన అదనపు గదిని బుధవారం ప్రారంభించారు. అనంతరం  మొక్కలు నాటారు. మండలంలోని కాసారంలో డీఏఎంఎఫ్‌టీ నిధులు 18.40 లక్షలతో నిర్మించనున్న పద్మశాలీ,  ఎస్సీ సంక్షేమ సంఘాలు స్వశక్తి సంఘ అదనపు భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మంగపేట పంచాయతీ పాలకవర్గం రేషన్‌ డొనేషన్‌ ద్వారా సేకరించిన బియ్యాన్ని  86 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే  పంపిణీ చేశారు. ఈ సందరర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గానికి వెయ్యి పాడి ఆవుల యూనిట్లు మంజూరయ్యాయని తెలిపారు. రైతులు సాగుతోపాటు పాడిపై దృష్టి సారించాలని సూచించారు.  కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నేత వీర్ల వెంకటేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏను గు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శ్రీరాం మధుకర్‌, జడ్పీటీసీ పుల్కం అనురాధ, ఏఎంసీ చైర్మన్‌ సాగి మ హిపాల్‌రావు,  విండో చైర్మన్లు  తిర్మల్‌రావు,  బాలగౌడ్‌, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌   గంగన్న, వైస్‌ ఎంపీపీ రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ వేముల భాస్కర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు  నవీన్‌రా వు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, సర్పంచులు  గంగాధర్‌, దామోదర్‌,   వేదాం తి, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


logo