శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 17, 2020 , 01:56:48

అన్నదాతలకు సర్కారు భరోసా

అన్నదాతలకు సర్కారు భరోసా

మానకొండూర్‌: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి అన్నదాతలకు భరోసా కల్పించిందని సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు పేర్కొన్నారు. వానకాలం సీజన్‌లో రైతుబంధు కింద ఇప్పటికే  రూ. 5,500 కోట్లు విడుదల చేయగా, మరో పది రోజుల్లో రూ. 1500 కోట్లు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంపై సుడా చైర్మన్‌తో పాటు ఆర్‌బీఎస్‌ సభ్యులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, రైతులు హర్షం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో మంగళవారం ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ రామంచ గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్‌, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ పడాల సతీశ్‌గౌడ్‌, ఆయా గ్రామాల ఆర్‌బీఎస్‌ కన్వీనర్లు, నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. 

గన్నేరువరం: మండల కేంద్రంలో ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ బోడ మాధవరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఆర్‌బీఎస్‌ జిల్లా కోఆర్డినేటర్‌ గూడెల్లి తిరుపతి, ఎంపీపీ లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, రైతు బంధు సమితి సభ్యులు, నాయకులు పుల్లెల లక్ష్మణ్‌, బూర వెంకటేశ్వర్లు, గొల్లపెల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.


logo