ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 16, 2020 , 00:44:12

రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

చొప్పదండి: రైతుల ఆర్థికాభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని ప్రగతిపథం వైపు నడిపిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని మంగళపల్లిలో సోమవారం సాగుబాటలో భాగంగా ఎమ్మెల్యే స్వయం గా జోడెడ్ల నాగలితో దుక్కి దున్ని ఏరువాక ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిమాండ్‌ ఉన్న పంటలను పండించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ప్రస్తుతం రాష్ట్రంలో వానలు లేకుండా సాగు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు మొగ్గు చూ పాలని, పంట మార్పిడితో భూసారాన్ని పెంచుకోవడమే కాకుండా అధిక లాభాలను పొందే అవకాశముందన్నారు.     ఇక్కడ గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, సర్పంచ్‌ వెల్మ నాగిరెడ్డి, నాయకులు గాండ్ల లక్ష్మణ్‌, రైతులు ఉన్నారు.  logo