ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 16, 2020 , 00:21:18

పాడి రైతులకు అండగా ప్రభుత్వం

పాడి రైతులకు అండగా ప్రభుత్వం

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌  

మానకొండూర్‌ రూరల్‌: పాడి రైతులకు  తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అన్నారు. సోమవారం మానకొండూర్‌ మండలం ముంజంపల్లి గ్రామం లో నూతనంగా ఏర్పాటు చేసిన పాల డెయిరీ  కేంద్రాన్ని ఎమ్మెల్యే, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు, కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్‌ మాట్లాడుతూ, ప్రతి రైతు నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. కరోనా వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరీంనగర్‌ డెయిరీ చైర్మన్‌ మాట్లాడుతూ, గ్రామానికో ఫర్టిలైజర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గ్రామంలో గడ్డం రాజయ్య అనే పాడి రైతు మృతిచెందడంతో అతడి భార్య భారతికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రామంచ గోపాల్‌రెడ్డి, జడ్పీటీసీ శేఖర్‌గౌడ్‌, డెయిరీ చైర్మన్‌ వీరస్వామి, ఉప సర్పంచ్‌ కుమారస్వామి, డైరెక్టర్లు, మాజీ ఎంపీటీసీ మల్లేశం, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు మల్లయ్యచారి, నాయకులు అనిల్‌గౌడ్‌, శ్రీనివాస్‌, గాజర్ల మల్లారెడ్డి, విజేందర్‌రెడ్డి, సర్పంచ్‌ దేవ సతీశ్‌రెడ్డి, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. 


logo