గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jun 15, 2020 , 01:32:03

రైతుబీమా అన్నదాతకు ధీమా

రైతుబీమా అన్నదాతకు ధీమా

గంగాధర: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం అన్నదాతల జీవితానికి ధీమా కల్పిస్తున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మండలంలోని కాసారం గ్రామానికి చెందిన పెద్దిపెల్లి రాములు అనే రైతు మృతి చెందారు. రాములు రైతుబీమాలో పేరు నమోదు చేయించుకోగా, రూ. 5 లక్షల పరిహారం మంజూరైంది.  ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆదివారం వెళ్లి బాధిత కుటుంబ సభ్యులకు రైతుబీమా  మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతు కుటుంబాలకు భరోసా కల్పించే విధంగా సీఎం కేసీఆర్‌ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు.  ప్రతిపక్షాలు ప్రభుత్వ పథకాలపై అసత్యపు ప్రచారం చేస్తున్నాయని, రైతులు నమ్మవద్దన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వ్యవసాయాభివృద్ధి జరిగిందన్నారు. 

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి

హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కోరారు. గ్రీన్‌డేలో భాగంగా మండలంలోని లింగంపల్లిలో స్థానిక నాయకులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుల్కం అనురాధ నర్సయ్య, ఏఎంసీ చైర్మన్‌ సాగి మహిపాల్‌రావు, గంగాధర సింగిల్‌విండో చైర్మన్‌ దూలం బాలగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ వేముల భాస్కర్‌, టీఆర్‌ఎస్‌  మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అట్ల రాజిరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఇస్మాయిల్‌, సర్పంచులు వేముల దామోదర్‌, తోట పద్మ, ఎంపీటీసీ దూలం లక్ష్మి, నాయకులు ఆకుల మధుసూదన్‌, దూలం శంకర్‌గౌడ్‌, వేముల అంజి, నాయకులు పాల్గొన్నారు.

 కేటీఆర్‌ నినాదం సీజనల్‌కు స్వీయమందు

 చొప్పదండి: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు  ‘ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు’ సీజనల్‌ వ్యాధులకు స్వీయ మందులా పనిచేస్తుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. చొప్పదండిలోని క్యాంపు కార్యాలయ ఆవరణలో  పూలకుండీలు, ఖాళీస్థలంలో నిల్వ ఉన్న నీళ్లు, చెత్తాచెదారం తొలగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటి ఆవరణలో చెత్త, నిల్వ ఉన్న నీటిని తొలగించాలని సూచించారు. వానకాలంలో దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే సీజనల్‌ వ్యాధులు ప్రబలవన్నారు. కరోనా వైరస్‌ వ్యాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటించాలని పిలుపు నిచ్చారు. అలాగే పట్టణంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ తమ ఇంటి ఆవరణలో చెత్తాచెదారం, నిల్వ ఉన్న నీటిని తొలగించారు.logo