బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 14, 2020 , 01:14:08

వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో ఇద్దరి ఆత్మహత్య

  • n  ఉరేసుకొని వలస కూలీ
  • n  మనస్తాపంతో మరొకరు

వేములవాడ రూరల్‌: వేములవాడ మండలం కోడుముంజ గ్రామశివారులో ఓ వలస కూలీ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, జనగామ జిల్లా నర్మెట్ట మండలం మల్కాపేట గ్రామానికి చెందిన రామస్వామి(50) ఏడాది క్రితం సిరిసిల్ల పట్టణానికి వచ్చి కూలీ పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఉరివేసుకోగా స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించగా రామస్వామి జేబులో తన కుటుంబసభ్యుల ఫోన్‌ నెంబర్‌ ఉండడంతో వారికి సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యులు వచ్చిన అనంతరం కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ ఉపేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. జ్యోతినగర్‌(రామగుండం): రామగుండం ఏ కాలనీకి చెందిన రాజ్‌కుమార్‌ సింగ్‌(60) అనే జెన్‌కో మాజీ కాంట్రాక్టర్‌ తన క్వార్టర్‌లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మూడురోజుల క్రితం మద్యం మత్తులో రాజ్‌కుమార్‌సింగ్‌ తన భార్య రాధికాదేవితో గొడవపడ్డాడు. దీంతో ఆమె కరీంనగర్‌లోని పుట్టింటికి వెళ్లింది. ఈక్రమంలో ఒంటరితనం భరించలేక మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. శనివారం క్వార్టర్‌ నుంచి  దుర్వాసన రావడంతో స్థానికులు రామగుండం పోలీసులకు సమాచారం అందించారు. అతడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామగుండం ఎస్‌ఐ మామిడి శైలజ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo