బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 14, 2020 , 01:12:23

తండ్రి ముచ్చట తీరకముందే..

తండ్రి ముచ్చట తీరకముందే..

  • నిండు గర్భిణి అయిన భార్యను చూసేందుకు వెళ్తూ భర్త మృత్యుఒడికి

గొల్లపల్లి: అతడి భార్య ఎనిమిది నెలల గర్భిణి..  చూసేందుకు వెళ్తుండగా అదుపుతప్పి బైక్‌ కాలువలో పడ్డ ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కల్లెడకు చెందిన సబ్బు సతీశ్‌(26) ముంబైలో ఉపాధి పొందేవాడు. కరోనా వైరస్‌ కారణంగా అక్కడినుంచి స్వగ్రామానికి వచ్చి కొన్నిరోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడు. అతడి భార్య గర్భవ తి కావడంతో తల్లిగారిల్లు నంచెర్ల వద్దే ఉంటున్నది. ఆమెను చూడడానికి బుగ్గారం మండలం గంగాపూర్‌ గ్రామానికి చెందిన పొలాస రాజయ్యతో కలిసి సతీశ్‌ నంచెర్లకు బైక్‌పై బయలుదేరారు. రాపల్లి మీదుగా, ఎస్సారెస్పీ కాలువమార్గంలో వెళ్తుండగా గొల్లపల్లి శివారులో బైక్‌ అదుపుతప్పి కాలువలో పడిపోయింది. కాలువ సీసీకి సతీశ్‌ తల తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. రాజయ్యకు స్వల్పగాయాలు కాగా రాజయ్యను చికిత్సకు జగిత్యాల ఏరియా దవాఖానకు తరలించారు. ఎస్‌ఐ జీవన్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలను సేకరిస్తున్నారు. కాగా సతీశ్‌ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. logo