శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 13, 2020 , 01:54:53

శాంతిభదత్రల పరిరక్షణే లక్ష్యం

శాంతిభదత్రల పరిరక్షణే లక్ష్యం

lప్రజలు సంతోషంగా ఉండాలి

lమంత్రి గంగుల కమలాకర్‌

lపోలీసుశాఖకు 300 సీసీ కెమెరాల అందజేత 

lరూ. కోటి వ్యయంతో కొనుగోలు

కార్పొరేషన్‌: కరీంనగర్‌లో శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పని చేస్తున్నామని, అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడం వల్ల అభివృద్ధి వేగవంతమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కళాభారతిలో సీఎం  అస్యూరెన్స్‌ నిధుల నుంచి రూ. కోటి వ్యయంతో కొనుగోలు చేసిన 300 సీసీ కెమెరాలతోపాటు ఇతర సామగ్రిని పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూడాలన్న లక్ష్యంతోనే రూ. కోటితో సీసీ కెమెరాలు, హార్ట్‌డిస్క్‌, టీవీలు ఇతర సామగ్రి కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పోలీసుల ఆధ్వర్యంలో నగరంలో సుమారు 6 వేలకు పైగా సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. కెమెరాల ఏర్పాటుతో ఇంకా నిఘా పెరుగుతుందని, నగరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని పేర్కొన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటే నగరానికి అనేక పరిశ్రమలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ శశాంక, మేయర్‌ వై సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, రమణారావు, గందె మాధవి, ఐలేందర్‌యాదవ్‌, బండారి వేణు, దిండిగాల మహేశ్‌, నాంపెల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు

కరీంనగర్‌ రూరల్‌: యాసంగిలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 64లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు మూడు రోజుల్లో డబ్బులు చెల్లించామని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. శుక్రవారం కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. లాభదాయకమైన పంటల సాగుపై రైతులు అందరూ కలిసి చర్చించుకునేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇకపై వర్షాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, చెరువుల్లో ఉన్న నీటితో పంటలు వేసుకోవచ్చని తెలిపారు. రైతులు నియంత్రిత వ్యవసాయంతో అన్నదాతలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. 

వెంకన్న ఆలయ ద్వార తోరణం ప్రారంభం

కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌ బస్టాండ్‌ వద్ద వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన ద్వార తోరణాన్ని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌  శుక్రవారం ప్రారంభించారు. కమాన్‌ నిర్మాణ దాతలను మంత్రి సన్మానించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్‌, వైస్‌ ఎంపీపీ ఉప్పు మల్లేశం, కొత్తపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ రుద్ర రాజు, సర్పంచులు జింక సంపత్‌, రాచమల్ల మధు, జడ్పీ కో ఆప్షన్‌ సభ్యుడు సాబీర్‌ పాషా, పిట్టల రవీందర్‌, మండల కో ఆప్షన్‌ సాధిక్‌ పాషా, శేఖర్‌ రావు, బద్దిపల్లి సర్పంచ్‌ రాచమల్ల మధు, దేవాలయ కమిటీ చైర్మన్‌ ఉప్పు తిరుపతి, నాయకులు ఉప్పు రాజశేఖర్‌, కడారి శ్రీనివాస్‌, దావ కమలమనోహర్‌, ఉప్పు శ్రీనివాస్‌, సాదినేని శ్రీనివాస్‌, సోము, గంగుల ప్రదీప్‌, రవీందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌, బద్దిపల్లి శ్రీనివాస్‌, శేఖర్‌ రావు, సాధిర్‌, మనోజ్‌కుమార్‌, బోనాల రాజేశం, తదితరులు పాల్గొన్నారు.logo