ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 12, 2020 , 02:18:24

ఫస్ట్‌ ఎయిడ్‌ శిక్షణతో సత్ఫలితాలు

ఫస్ట్‌ ఎయిడ్‌ శిక్షణతో సత్ఫలితాలు

  • n  క్షతగాత్రులకు పెట్రోకార్‌ సిబ్బంది సత్వర వైద్య సేవలు
  • n  తగ్గుతున్న మరణాల సంఖ్య

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌ కమిషనరేట్‌ పరిధిలో రోడ్డు ప్రమాదాలు సంభవించినపుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్షతగాత్రులను దవాఖానకు తరలించేలోపే మృత్యువాత పడుతుండడంతో కరీంనగర్‌ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఘటన జరిగిన ఐదు నిమిషాల్లో పెట్రోకార్‌ సిబ్బంది వెళ్లి క్షతగాత్రులను దవాఖానకు తరలించేవారు. అయితే, ఘటన జరిగిన మొదటి 15 నిమిషాలు క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందకపోతే మృత్యువాత పడే ప్రమాదం ఉందని గుర్తించి, పోలీసులే ప్రథమ చికిత్స అందించేలా వైద్య సిబ్బందితో శిక్షణ ఇప్పించారు. దీంతో పెట్రోకార్‌ సిబ్బందికి ప్రథమ చికిత్సపై ఇచ్చిన శిక్షణ సత్ఫలితాలనిస్తున్నది. 2020 జనవరి ఒకటిన ప్రారంభమైన పెట్రోకార్‌ ఫస్ట్‌ ఎయిడ్‌ సిస్టమ్‌ చాలా వరకు మరణాల శాతాన్ని తగ్గించింది. సరైన సమయంలో గాయపడిన వారిని రక్షించిన పోలీసులకు శాఖాపరంగా రివార్డులు కూడా అందిస్తున్నారు. పోలీసులు ప్రథమ చికిత్స చేస్తున్న విధానం సత్ఫలితాలనిస్తున్నదని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. కరీంనగర్‌, హుజూరాబాద్‌, హైదరాబాద్‌, జగిత్యాల వెళ్లే రహదారుల్లో నిత్యం పెట్రోకార్‌ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మరో 27 వాహనాలు స్టేషన్ల పరిధిలో గస్తీ నిర్వహిస్తుండడంతో ఎలాంటి ఘటనలు జరిగినా పది నిమిషాల్లోపే వైద్య సేవలందించే సౌకర్యం ఉండడంతో సత్ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు. 


logo