బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 11, 2020 , 01:32:24

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..

అభివృద్ధే ధ్యేయంగా ముందుకు..

l చెరువులు కళకళలాడితే రైతులు ఆర్థికంగా ఎదిగినట్లే

l మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

l రేణికుంటలో రూ.20 లక్షలతో జీపీ భవనం పనులు ప్రారంభం

తిమ్మాపూర్‌ రూరల్‌: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని, మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దున్నామని మానకొండూర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని రేణికుంట గ్రామంలో రూ.20లక్షల నిధులతో చేపట్టిన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గ్రామాలను సస్యశ్యామలం చేయడం కోసం కాళేశ్వర జలాలతో ఇప్పటికే 47కుంటలను నింపినట్లు తెలిపారు. కుంటలు, చెరువులు కళకళలాడితే రైతులు ఆర్థికంగా ఎదిగినట్లేనని స్పష్టం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ విరివిరిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అలాగే రేణికుంట గ్రామంలో రైతుమార్కెట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీవో రవీందర్‌ రెడ్డిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, సర్పంచ్‌  బోయిని కొమురయ్య, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌ రెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, గ్రామ పాలకవర్గ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.logo