సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 10, 2020 , 02:06:13

బందనకల్‌ మురిసింది..

బందనకల్‌ మురిసింది..

నేడు జలహారతి ఇవ్వనున్న అమాత్యుడు రామన్న 

నిండుకుండలా ఊరచెరువు.. ఆ పక్కనే దూకుతున్న మత్తడి.. ఆ దాపునే పచ్చని చెట్లను ఆనుకొని ఇండ్లు.. ఎంత ఇంపుగా కనిపిస్తున్నదీ పల్లె! మిషన్‌ కాకతీయతో జీవం పోసుకున్న ఆ చెరువు, కాళేశ్వర జలాలతో మండుటెండల్లోనూ కనువిందు చేస్తున్నది! ఏళ్లకేళ్లుగా తాగు, సాగునీటికి తండ్లాడిన మెట్టప్రాంతం ‘బందనకల్‌' ఇప్పుడు జలకాలాడుతున్నది! అపర భగీరథుడు కేసీఆర్‌ కృషితో సిద్దిపేట జిల్లాలోని రంగనాయకసాగర్‌ ప్రాజెక్ట్‌కు ఎదురెక్కి.. కాలువ ద్వారా ముస్తాబాద్‌ మండలం వెంకట్రావుపల్లెలోని పులికుంటకు చేరిన గంగమ్మ, ఇప్పుడు అక్కడి నుంచి ఈ ఊరచెరువుకు పరవళ్లు తొక్కింది. అమాత్యుడు రామన్న నేడు జలహారతి ఇవ్వనుండగా, ఊరుఊరంతా మురిసిపోతున్నది.  

తాజావార్తలు


logo