శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 10, 2020 , 02:03:26

ఏడున్నర ఎకరాల్లో వైవిధ్యసాగు

ఏడున్నర ఎకరాల్లో వైవిధ్యసాగు

n పండ్లతోటలతో ఆర్థిక లబ్ధి

n ఖానాపూర్‌లో  యాపిల్‌ సాగు చేస్తున్న రైతు

n తైవాన్‌ సీతాఫలం,  జామ, మామిడి ఫలాలు 

n మంచి ఆదాయాన్నిస్తున్న  యాపిల్‌బేర్‌

ఖానాపూర్‌ : ఖానాపూర్‌లో ఓ రిటైర్డ్‌ ఉద్యోగిని సంకల్ప బలం పండ్ల తోటల వైపు నడిపించింది. స్థానికుడైన మహ్మద్‌ ఖాజా ప్రభుత్వ ఉద్యోగిగా పదేళ్ల క్రితం విరమణ పొందాడు. ఆ తర్వాత బీర్నంది కొమ్ముతండా శివారులో 7.20 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. సాగుకు అనుకూలంగా మార్చుకున్నాడు. ఆ తర్వాత మామిడితో పాటు వివిధ పండ్ల మొక్కలను నా టాడు. కెరమెరి మండలంలో కేంద్రె బాలాజీ యాపిల్‌ తోట విషయం తెలుసుకొని, తాను కూడా ఆ మొక్కలను నాటాలని నిశ్చయించుకున్నాడు. హర్యానా నుంచి 320 యా పిల్‌ మొక్కలను తెచ్చి తన తోటలోని ఎకరన్నర స్థలంలో గత జనవరిలో నాటా డు. అర్మాన్‌-99 రకానికి చెందిన ఈ యాపిల్‌ మొక్కలు ప్రస్తుతం మూడడుగుల మేర పెరిగాయి. వాటికి డ్రిప్‌ ద్వారా నీరు పెడుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నుంచి మూడేళ్ల క్రితం యాపిల్‌ బేర్‌ మొక్కలను తెచ్చాడు. ఆ చెట్లు ఆరోగ్యంగా పెరిగి మంచి కాత అందిస్తున్నాయి. ఒక్కొక్క యాపిల్‌బేర్‌ టమాటో సైజులో వస్తున్నదని, ఇప్పటికి మూడు సార్లు చేతికి వచ్చాయని రైతు ఖాజా తెలిపాడు. ఒక్కో చెట్టుకు గరిష్టంగా ఒక క్వింటాల్‌ కాయలు కాస్తాయి. ఒక్క చెట్టు ద్వారా తనకు కనీ సం రూ. 5 వేల వరకు ఆదాయం వస్తోంది. ఇంతే కాకుండా తైవాన్‌ రకం సీతాఫలం,జామ చెట్లు కూ డా తోటలు పెట్టాడు. అవి కూడా మూడేళ్లుగా కాత కాస్తున్నాయి. ఇక ఖాళీగా ఉన్న కొంత స్థలంలో లో కల్‌ రకం గుండు మల్లె నాటాడు. ప్రతి వేసవిలో గుండె మల్లె పూలతో అదనంగా ఆదాయం సంపాదిస్తున్నాడు. ఖాజా తనకున్న ఏడున్నర ఎకరాల్లో ఎక్కడా కూడా స్థలాన్ని వృథా పోనివ్వలేదు. కొద్ది స్థలంలో అరటి, నిమ్మ వేసి వాటి ద్వారా కూడా ఆ దాయం పొందుతున్నాడు. ఇవే కాకుండా 500 బంగినపెల్లి, దశేరి, ఇతర రకాల మామిడితో ప్రతి యేటా ఖర్చులు పోను గణనీయంగా ఆదాయం ఆర్జిస్తున్నాడు మమ్మద్‌ ఖాజా. అలాగే తక్కువ సం ఖ్యలో దానిమ్మ, సపోటా, సూది నిమ్మ నాటాడు. తోట లో పెరటి కోళ్లు కూడా పెంచుతున్నాడు. ఇలా ఖానాపూర్‌ ప్రాంతంలో ఎవరు చేయని విధంగా ఉన్న తక్కువ భూమిలో రకరకాల పంటలు పండిస్తూ, ఆర్థిక లబ్ధి పొందుతున్నాడు ఖాజా. తైవాన్‌ రకం సీతాఫలం, తై వాన్‌ జామలు కలిపి అర ఎకరంలో, ఆర్మ న్‌-99 రకం యాపిల్‌ చెట్లు మాత్రం ఒకటిన్నర ఎకరంలో వేశాడు. ఒకొక్క యాపిల్‌ మొక్కకు రూ.4225 ఖర్చు అ య్యిందని, హర్యానా నుంచి వీటిని కొనుగోలు చేసి తెచ్చినట్లు చెప్పాడు. వచ్చే ఏడాది నుంచి కాత వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. ఏడున్నర ఎకరాల తోటలో మిగులు భూమిలో పెరటి కోళ్లు, గొర్రెల మందలను కూడా పెంచేందుకు షెడ్డు వేసుకున్నాడు. 

విభిన్న సాగుతోనే మేలు..

13 ఏళ్లుగా ఎవుసం చేస్తున్న. మంచి వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవాలనేది నా కల. ఉద్యోగిగా విరమణ పొందాక ఆచరణలో పెట్టాను. తొలుత ఒక్క మామిడి తోట మొదలుపెట్టా. ఆ తర్వాతే తీరొక్క పంటలు వేయాలనుకున్న. ఇప్పుడు కనీసం 10 రకాల పండ్ల పంటలతో, అవి ఇచ్చే ఆదాయంతో సంతోషంగా ఉన్న. ఖచ్చితంగా వచ్చే ఏడాదిలో యాపిల్‌ కాయలు వస్తయి. ఉద్యాన వన శాఖ అధికారుల సలహాలు కూడా తీసుకుంటున్న. తోట నిర్వహణకు రూ. 70 వేలు వేతనం ఇచ్చి ఒక పాలేరును కూడా పెట్టుకున్న. యేటా నిర్వహణ ఖర్చు రూ. 3 లక్షలు అవుతుండగా, అన్ని పంటలకు కలుపుకొని రూ. 8 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్న. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలాంటి వైవిధ్యమైన వ్యవసాయాన్నే ఎంతగానో ప్రోత్సహిస్తున్నరు.   - మహ్మద్‌ ఖాజా, రైతు, ఖానాపూర్‌(బీర్నంది)


logo