మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 09, 2020 , 02:06:27

కొనసాగుతున్న థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

కొనసాగుతున్న థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు

కరీంనగర్‌ హెల్త్‌: హుజూరాబాద్‌ మండలం కాట్రపల్లి, వల్బాపూర్‌ గ్రామాల్లో డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీ సుధాకర్‌రెడ్డి, చెల్పూర్‌ మండల వైద్యాధికారి రాజమౌళి పర్యవేక్షణలో సోమవారం వైద్య బృందాలు ఇంటింటికీ సర్వే నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. ఐదు వైద్య బృందాలు కాట్రపల్లిలో 138 గృహాలను సందర్శించి 486 మందికి, వల్బాపూర్‌లో 4 వైద్య బృందాలు 103 గృహాలను సందర్శించి 386 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించారు. చొప్పదండి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఐదు వైద్య బృందాలు 290 గృహాలను సందర్శించి 988 మందికి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద 86 మందికి థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు. logo