శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 09, 2020 , 02:06:26

మెరుగైన వైద్య సేవలందించాలి

మెరుగైన వైద్య సేవలందించాలి

n ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల

n  ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల సన్మానం

కరీంనగర్‌ హెల్త్‌: ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రత్నమాల సూచించారు. సోమవారం ఆమెను తెలంగాణ మెడికల్‌ హెల్త్‌ ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఎండీ అజ్గర్‌పాషా ఆధ్వర్యంలో ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యోగులంతా కొవిడ్‌-19 నియంత్రణలో పాలు పంచుకుంటున్నారని, ప్రతి ఒక్కరి సేవలు అభినందనీయమన్నారు. ముఖ్యంగా నాల్గో తరగతి ఉద్యోగులతో పాటు సిబ్బంది, వైద్యులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని, ఇదే స్ఫూర్తితో అందరూ ముందుకెళ్లాలన్నారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య, ఏవో నజీముల్లాఖాన్‌, శ్రీధర్‌, పూర్ణిమ, సుప్రియ, స్వప్నరాణి, స్రవంతి, మునీర్‌, శ్రీకాంత్‌, స్వామి, రమణాచారి, జహీర్‌, సంతోష్‌, నవీన్‌, సుధాకర్‌, రవీందర్‌, సంగీత పాల్గొన్నారు.logo