బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 09, 2020 , 02:06:24

పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ

పరిశుభ్రతతోనే వ్యాధుల నివారణ

n మేయర్‌ వై సునీల్‌రావు

n ముగిసిన పారిశుధ్య వారోత్సవాలు

కార్పొరేషన్‌: ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్‌ వ్యాధులను అరికట్టవచ్చని మేయర్‌ వై సునీల్‌రావు తెలిపారు. ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఆయన నగరంలోని 35, 53, 13 డివిజన్లలో పర్యటించి, పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు నగరంలో పారిశుధ్య వారోత్సవాలు చేపట్టామన్నారు. ఇకపై వారంలో ఒక రోజు డివిజన్లలోని ఖాళీ స్థలాలను శుభ్రం చేయిస్తామని తెలిపారు. వానకాలంలో వర్షపు నీరు నిలిచి ఉండకుండా మురుగు కాలువలను శుభ్రం చేయిస్తున్నామని పేర్కొన్నారు. నగరంలోని ప్రతి డివిజన్‌లో   కార్మికులను నియమించి పనులు చేపడుతామన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, కచ్చ కాలువలు ఏర్పాటు చేయడంతో పాటు శాశ్వత పరిష్కారం కోసం అభివృద్ధి పనులకు సంబంధించి అంచనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు తమ ఇండ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఇండ్లల్లోని తడి, పొడి చెత్తను వేర్వేరుగా బుట్టల్లో వేసి మున్సిపల్‌ సిబ్బంది తీసుకువచ్చే రిక్షాల్లో వేయాలని కోరారు. 

డివిజన్లలో జోరుగా పనులు

పారిశుధ్య వారోత్సవాల్లో భాగంగా నగరంలోని 60 డివిజన్లలో పనులు ముమ్మరంగా చేపట్టారు. చివరి రోజు ఆయా డివిజన్ల కార్పొరేటర్లు, ప్రత్యేకాధికారులు మురుగు కాలువలను శుభ్రం చేయించారు. ఖాళీ స్థలాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనులు చేపట్టారు. ప్రతి డివిజన్‌  పరిశుభ్రంగా ఉండేలా ప్రజలు సహకరించాలని కార్పొరేటర్లు కోరారు. వానకాలం ముగిసే వరకు పారిశుధ్య పనులపై ప్రత్యేక దృష్టిసారిస్తామని కార్పొరేటర్లు వెల్లడించారు. logo