శనివారం 26 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 08, 2020 , 03:08:44

సమగ్రాభివృద్ధే సర్కార్‌ ధ్యేయం

సమగ్రాభివృద్ధే సర్కార్‌ ధ్యేయం

చొప్పదండి: పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలతో సమగ్రాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. చొప్పదండి పట్టణంలోని 12వ వార్డు, రాగంపేట అనుబంధ గ్రామం భీరంపల్లెలో పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. 12వ వార్డులో నిలువ ఉన్న నీటిలో దోమల నివారణకు ఆయిల్‌బాల్స్‌ వేశారు. రాగంపేటలో వీధుల్లో తిరుగుతూ పారిశుధ్యం, సీజనల్‌ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతతోనే సీజనల్‌ వ్యాధులు దరిచేరవని అన్నారు. మురుగు నీరు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను గ్రామపంచాయతీ, మునిసిపాలిటీ వాహనాల్లో మాత్రమే వేయాలని చెప్పారు. కాగా పారిశుధ్య పనుల పరిశీలనకు వచ్చిన ఎమ్మెల్యే సుంకె భీరంపల్లెలో గడపగడపకూ తిరిగి ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఓ చిన్నపాపకు కళ్లు కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలుపడంతో వెంటనే వైద్యాధికారితో ఫోన్‌లో మాట్లాడి పాపకు తొందరగా సర్టిఫికేట్‌ ఇప్పించాలని, దివ్యాంగ పెన్షన్‌ వెంటనే మంజూరయ్యేలా చేస్తానని హామీ ఇచ్చారు.  ఆయనవెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ వెల్మ మల్లారెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుర్రం నీరజ, వైస్‌ చైర్‌పర్సన్‌ ఇప్పనపల్లి విజయలక్ష్మి, కౌన్సిలర్లు కొత్తూరి మహేశ్‌, దండె జమున,  సర్పంచ్‌ మామిడి లత, కో ఆప్షన్‌ సభ్యుడు పాషా, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌, మాజీ జడ్పీటీసీ ఇప్పనపల్లి సాంబయ్య, నాయకులు మామిడి రాజేశం, గోపు రమ, దీకొండ సురేశ్‌, జహీర్‌, గోపు జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బత్తిని బుచ్చయ్య, కళ్లెం లచ్చిరెడ్డి, పబ్బ శ్రీనివాస్‌, ఎరుకుల శ్రీనివాస్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు. 


logo