గురువారం 01 అక్టోబర్ 2020
Karimnagar - Jun 08, 2020 , 03:09:19

పోలీసులకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ

పోలీసులకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ

కరీంనగర్‌ క్రైం : ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు నాలుగు రోజులపాటు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నామని సీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, యోగా, ధ్యాన ం, ప్రాణాయామం అంశాలపై శిక్షణకు ఆసక్తి చూపే వారికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుందని, అతి త్వరలోనే ఈ శిక్షణ ప్రారంభం కానుందన్నారు. అన్ని స్థాయిలకు చెంది న పోలీసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

పీటీసీని సందర్శించిన సీపీ

కరీంనగర్‌లోని పోలీస్‌ శిక్షణ కళాశాలలో మియావాకీ పద్ధతిలో చిట్టడవుల పెంపకాన్ని చేపట్టే ప్రాంతాలను సీపీ కమలాసన్‌రెడ్డి సందర్శించారు. ఈనెల 20న ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా పీటీసీలో 25వేల మొక్కల పెంపకానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. పీటీసీ అధికారులు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో కమిషనరేట్‌ పోలీసుల తరుపున తమవంతు సహాయ, సహకారాలను అందజేస్తామన్నారు. భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని మొక్కల పెంపకానికి పోలీసులు ముందుకు రావాలని కోరారు. 

పోలీసుల మార్నింగ్‌ వాక్‌

దేహదారుఢ్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు కమిషనరేట్‌ పోలీసులు దినచర్యలో భాగంగా వ్యాయామం, వాకింగ్‌, యోగా, ధ్యానం వంటివి చేస్తున్నారు. ఇందులో భాగంగా సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పీటీసీ పోలీసులు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ ఆవరణ నుంచి పీటీసీ వరకు నడక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ డీసీపీ, పీటీసీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ చంద్రమోహన్‌, అడిషనల్‌ డీసీపీ శ్రీనివాస్‌, ఏసీపీలు అశోక్‌, విజయసారథి, పీటీసీ డీఎస్పీ చంద్రయ్య, ఇండోర్‌ వి భాగం ఇన్‌స్పెక్టర్‌ హనోక్‌, ఎస్‌బీఐ ఇంద్రసేనారెడ్డి, పీటీసీ, కమిషనరేట్‌ పోలీసులు, సిబ్బందితోపాటు పలువురు పాల్గొన్నారు.


logo