శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - Jun 07, 2020 , 02:01:05

సీజనల్‌ వ్యాధుల నివారణకే ప్రత్యేక డ్రైవ్‌

సీజనల్‌ వ్యాధుల నివారణకే ప్రత్యేక డ్రైవ్‌

పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలి

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక

హుజూరాబాద్‌ టౌన్‌: సీజనల్‌ వ్యాధుల నివారణ కోసమే ప్రభుత్వం ఇన్సెంటివ్‌ శానిటేషన్‌ డ్రైవ్‌ చేపట్టిందని, పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ కొలిపాక నిర్మల కోరారు. శనివారం ఈ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం పరిధిలోని 21, 22, 23, 24వ వార్డుల్లో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు పారిశుధ్య సిబ్బంది పనులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో కమిషనర్‌ జోనతో కలిసి వారు పర్యటించారు. పారిశుధ్య పనులను పరిశీలించారు.  ప్రతి వార్డులో కౌన్సిలర్లు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు గుర్తించి తమ దృష్టికి తీసుకువస్తే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు పైళ్ల వెంకట్‌రెడ్డి, మొలుగు సృజనకుమారి, పోతరవేని రాజకొంరమ్మ, వార్డుల ప్రత్యేకాధికారులు మున్సిపల్‌ ఇంజినీర్‌ చంద్రమౌళి, హెల్త్‌ అసిస్టెంట్‌ ఎం రాజు, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీర్‌ పీ వినయ్‌కుమార్‌, కే మురళి, శానిటరీ జవాన్లు ప్రతాప రాజు, ఆరెల్లి రమేశ్‌, మెప్మా సిబ్బంది కోమల, రమాదేవి, వసంత, ఎం లలిత, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.జమ్మికుంట రూరల్‌: పరిసరాలను శుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యతని మండల ప్రత్యేకాధికారి దేవేందర్‌రావు, ఎంపీడీవో జయశ్రీ పేర్కొన్నారు. శనివారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా సైదాబాద్‌, కోరపల్లి, మడిపల్లి, గ్రామాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. స్వచ్ఛతకు సంబంధించి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్‌ సీఐ అక్బర్‌హుస్సేన్‌, సర్పంచులు పరశురాములు, శైలజ, రమాదేవి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.


logo