మంగళవారం 07 జూలై 2020
Karimnagar - Jun 05, 2020 , 00:30:39

నేత బతుకుల జీవనరీతులు

నేత బతుకుల జీవనరీతులు

కండెను చుట్టి.. భీములు పోసి.. పోగు పోగును కలిపి.. తీరొక్క వర్ణాలను మేళవించి మునివేళ్లపై నుంచి అచ్చెరువొందేలా.. వస్ర్తాన్ని సృష్టించే చేనేత కళాకారుడి ప్రతిభ ఆసాంతం అద్భుతం. అద్వితీయం. ఆ జీవనరీతిని.. చేనత వృత్తిని ప్రతిబింబించే పై చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌లోని పరిపాలన భవనం, క్యాంటీన్‌ భవనాల గోడలపై తీర్చిదిద్దిన మరమగ్గాల కార్మికుల బతుకు చిత్రాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. బతుకమ్మ చీరలు, సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టి పడుతుండడంతోపాటు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

- సిరిసిల్ల రూరల్‌logo