శుక్రవారం 10 జూలై 2020
Karimnagar - Jun 04, 2020 , 02:27:49

పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

పరిసరాల శుభ్రత అందరి బాధ్యత

ఇండ్ల ఆవరణల్లో చెత్త, నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి

కరీంనగర్‌ కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ 

మంగళపల్లిలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం పరిశీలన

చొప్పదండి: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత సర్పంచులు, అధికారులతోపాటు ప్రజలందరిపైనా ఉందని కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మండలంలోని మంగళపల్లి గ్రామాన్ని బుధవారం వారు సందర్శించారు. పలువీధుల్లో పర్యటించారు. రోడ్డుపై ఉన్న చెత్తను స్వయంగా ఎత్తి పంచాయతీ ట్రాక్టర్‌లో పోశారు. అనంతరం వారు ప్రజలతో మాట్లాడుతూ, సీజనల్‌ వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో చెత్తాచెదారాన్ని, నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తూ దోమలు, ఈగలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో మొక్కలు నాటారు. సింగిల్‌విండో ఆధ్వర్యంలో చేపడుతున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచించారు. వారి వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి, ఎంపీపీ చిలుక రవీందర్‌, సింగిల్‌విండో చైర్మన్లు వెల్మ మల్లారెడ్డి, మినుపాల తిరుపతి రావు, సర్పంచ్‌ వెల్మ నాగిరెడ్డి, ఎంపీటీసీ వెల్మ విజయలక్ష్మి, ఉప సర్పంచ్‌ సురేశ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు బందారపు అజయ్‌కుమార్‌ గౌడ్‌, నాయకులు వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌, కొత ్తగంగారెడ్డి, మాచర్ల వినయ్‌, ఏనుగు స్వామి రెడ్డి, గాండ్ల లక్ష్మణ్‌, ఏవన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

సాగులో వైజ్ఞానికతను చాటాలి

రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం వినూత్న పంటల సాగుకు చేయూతనందిస్తున్న తరుణంలో పంటల సాగులో రైతులు వైజ్ఞానికతను చాటాలని కలెక్టర్‌ శశాంక పిలుపునిచ్చారు. తిర్మలాపూర్‌, లక్ష్మీపూర్‌ గ్రామాల్లో యువరైతులు కట్ల శ్రీనివాస్‌, ద్యావ రాంచంద్రారెడ్డి సాగు చేస్తున్న అంజీరా, డ్రాగన్‌ఫ్రూట్‌ పంటలను బుధవారం ఉదయం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి సందర్శించారు. ముందుగా లక్ష్మీపూర్‌లోని డ్రాగన్‌ ఫ్రూట్‌ను సందర్శించిన కలెక్టర్‌ రైతు రాంచంద్రారెడ్డితో మాట్లాడారు. డ్రాగన్‌ పండును రుచి చూసి రైతును అభినందించారు. అనంతరం తిర్మలాపూర్‌ చేరుకున్న కలెక్టర్‌ యువరైతు కట్ల శ్రీనివాస్‌తో మాట్లాడారు.  ఉన్నత ఉద్యోగాన్ని వదిలి, ఉన్న ఊరు కన్నవారిపై ప్రేమతో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయంపై దృష్టి సారించిన శ్రీనివాస్‌ను రైతులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో కూడా ఆయిల్‌పాం సాగు చేపట్టే అవకాశం ఉందన్నారు. దీనిని తన తోట నుంచే ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. వారి వెంట జిల్లా ఉద్యాన శాఖ అధికారి బండారి శ్రీనివాస్‌, ఎంపీపీ కలిగేటి కవిత, తహసీల్దార్‌ కోమల్‌రెడ్డి, ఎంపీడీవో సతీశ్‌రావు, నియోజకవర్గ హార్టికల్చర్‌ అధికారి మంజువాణి, ఆర్‌బీఎస్‌ మండల కోఆర్డినేటర్‌ కరుణాకర్‌, రెండు గ్రామాల సర్పంచులు రజిత, నర్సయ్య, ఎంపీటీసీ రవీందర్‌, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఆర్‌ఐలు రజని, తారాదేవి, నాయకులు తదితరులు ఉన్నారు.logo