శనివారం 11 జూలై 2020
Karimnagar - Jun 03, 2020 , 04:01:48

నిరాడంబరంగా నగరంలోతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాలు

నిరాడంబరంగా నగరంలోతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాలు

 • పార్టీలు , ప్రభుత్వ కార్యాలయల్లో మువ్వన్నెల రెపరెపలు
 • అమరవీరులకు ఘన నివాళి
 • పతావికాష్కరణ చేసిన మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌రావు

నగరవ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలను మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పార్టీల ఆఫీసుల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, కలెక్టర్‌ శశాంక, మేయర్‌ సునీల్‌రావు పతాకావిష్కరణ చేసి వందనం చేశారు. అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.. స్వరాష్ట్రంలో వివిధ రంగాల్లో సాధించిన విజయాలను నెమరేసుకున్నారు..  ఇదే స్ఫూర్తితో ముందుకు కదులుతామని ప్రతినబూనారు. 

కార్పొరేషన్‌/టవర్‌సర్కిల్‌/ కరీంనగర్‌ హెల్త్‌/కరీంనగర్‌ లీగల్‌: తెలంగాణ ఆవిర్భావోత్సవాలను నగరవ్యాప్తంగా సాదాసీదాగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొన్నారు.  కరీంనగర్‌ నగరపాలక సంస్థ కార్యాలయంలో నగర మేయర్‌ వై సునీల్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతకుముందు ప్రొఫెసర్‌ జయశంకర్‌, తెలంగాణ అమరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌, కమిషనర్‌ క్రాంతి, అదనపు కమిషనర్‌ శ్రీనివాస్‌, కార్పొరేటర్లు ఉన్నారు.

తీగలగుట్టపల్లిలోని కేసీఆర్‌ భవన్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, మేయర్‌ సునీల్‌రావు, కార్పొరేటర్‌ గంట కళ్యాణి పాల్గొన్నారు. 

 • మంకమ్మతోట పారమిత ఉన్నత పాఠశాలలో  విద్యాసంస్థల చైర్మన్‌ ప్రసాదరావు జెండాను ఎగురవేశారు. ప్రిన్సిపాల్‌ ప్రశాంత్‌కుమార్‌, ఆనంద్‌, కమలాకర్‌, తిరుపతిరావు పాల్గొన్నారు. 
 • తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌, లెక్చరర్స్‌ వెల్ఫేర్‌ అ సోసియేషన్‌ సభ్యులు అమరవీరుల స్తూపం వద్ద నివాళు లర్పించారు.  అనుమాండ్ల రవీందర్‌రెడ్డి, చందు, రమణారెడ్డి, మధూకర్‌, రాజేందర్‌, శ్రీనివాస్‌, వేణుమాధవ్‌, సతీశ్‌, భూపతి ఉన్నారు. 
 • కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ శశాంక జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
 • అదనపు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శ్యాం ప్రసాద్‌లాల్‌, జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ  జెండాను ఆవిష్కరించి, స్వీట్లు పంపిణీ చేశారు.  
 • ముకరంపురలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి జాతీయ జెండా ను ఆవిష్కరించారు. గ్రంథాలయ కార్యదర్శి ఏవీఎన్‌ రాజు, ఏనుగు రితీష్‌రెడ్డి, తిరుపతినాయక్‌, టీఆర్‌ఎస్వీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కిమ్‌ ఫహద్‌, ఉద్యోగులు, సిబ్బంది,   సరిత, శంకర్‌, చారి, వర్మ, తేజ తదితరులు పాల్గొన్నారు. 
 • వావిలాలపల్లిలోని అల్ఫోర్స్‌ విద్యా సంస్థల్లో  చైర్మన్‌  నరేందర్‌రెడ్డి జెండాను ఎగురవేశారు.   
 • మానేరు విద్యా సంస్థల్లో చైర్మన్‌ కడారి అనంతరెడ్డి పతాకావిష్కరణ చేశారు.  విద్యాసంస్థల డైరెక్టర్‌ కడారి సునీతారెడ్డి, ప్రిన్సిపాళ్లు రాజు చాకో, ప్రభాకర్‌రెడ్డి అధ్యాపకులు పాల్గొన్నారు. 
 • వాణీనికేతన్‌ ఇంగ్లిషు మీడియం పాఠశాలలో చైర్మన్‌ రేణుక జాతీయ జెండాను ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఏవో ప్రకాశ్‌రావు, ప్రిన్సిపాల్‌ హన్మంతారావు పాల్గొన్నారు. 
 • మెహర్‌నగర్‌లోని వింధ్యావాలీ ఉన్నత పాఠశాలలో  కరస్పాండెంట్‌ రామవరం లక్ష్మీప్రకాశ్‌రావు   జెండాను ఎగురవేశారు.  పాఠశాల వైస్‌ చైర్మన్‌ రా మవరం పృథ్వీరావు, ప్రిన్సిపాల్‌ జాయిస్‌ ఆనం ద్‌, ఇన్‌చార్జి జీ ప్రశాంత్‌  పాల్గొన్నారు. 
 • ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ   భవనంలో జిల్లా చైర్మన్‌ కేశవరెడ్డి జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో పండ్లు, వాటర్‌ ప్యాకెట్లు,  స్వీట్లు పంపిణీ చేశారు.  సెక్రటరీ వీ రాధాకృష్ణారెడ్డి, శ్రీ హరిరెడ్డి, ఈసీ సభ్యుడు కోల అన్నారెడ్డి, కమల్‌సోని, సాన వేణు, బోడ సుధాకర్‌, ఓం కార్‌, కృష్ణమూర్తి, ఎంఎల్‌ఎన్‌ రెడ్డి పాల్గొన్నారు.
 • జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో   సూ పరింటెండెంట్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌ జెండాను ఆవిష్కరించారు. ఆర్‌ఎంవో డాక్టర్‌ శౌరయ్య, ఏవో నజీముల్లాఖాన్‌, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ పుల్లెల సుధీర్‌, వైద్యులు పాల్గొన్నారు.
 • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో డీఎం అండ్‌హెచ్‌వో సుజాత పతాకావిష్కరణ చేశారు.  
 • టీబీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అప్తాబ్‌ అహ్మద్‌ఖాన్‌ జెండాను ఆవిష్కరించారు.   
 • ఎస్‌యూలో ఇన్‌చార్జి వీసీ చిరంజీవులు  పతాకావిష్కరణ చేశారు.  రిజిస్ట్రార్‌ భరత్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రసాద్‌, అధ్యాపకులు వరప్రసాద్‌, పద్మావతి, నీలేకుమార్‌, హరికిషన్‌  పాల్గొన్నారు.
 • కరీంనగర్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పీవీ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో  తెలంగాణ అమరులు, జయశంకర్‌ సారుకు ఘనంగా నివాళులర్పించారు.  ప్రధాన కార్యదర్శి లెంకల రాంరెడ్డి, ఉపాధ్యక్షులు ఆరెల్లి రాములు, కార్యదర్శి కొత్త ప్రకాశ్‌,   సభ్యులు శ్రీధర్‌రావు, ప్రభాకర్‌రావు, సుగుణాకర్‌రావు, తేజ్‌దీప్‌రెడ్డి ఉన్నారు. 
 • తెలంగాణ యూనియన్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఆ ధ్వర్యంలో అమరవీరులకు నివాళులర్పించారు.   నాయకులు గోపాలకృష్ణ, తిరుమల్‌, రామకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్‌  పాల్గొన్నారు. 
 • తెలంగాణ జాగృతి యువత జిల్లా అధ్యక్షుడు ఉయ్యాల విష్ణువర్ధన్‌ జాగృతి జిల్లా కార్యాల యం లో జాతీయ జెండాను ఎగురవేశారు.  కార్యక్ర మంలో పీఆర్‌వో రత్నాకరాచారి, దొంతినేని అభిరామ్‌రావు, సుధీర్‌  పాల్గొన్నారు.logo