బుధవారం 23 సెప్టెంబర్ 2020
Karimnagar - May 29, 2020 , 01:33:26

ప్రతి మడీ తడవాలె..

ప్రతి మడీ తడవాలె..

ప్రతి ఎకరం పచ్చబడేందుకే కాలువల నిర్మాణం 

సీఎం కేసీఆర్‌ సంకల్పంతో ముందుకు..

మానకొండూర్‌ నియోజకవర్గానికి లక్ష ఎకరాలే లక్ష్యం.

గన్నేరువరం మండలంలో 15వేల ఎకరాలు సాగులోకి 

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌

తిమ్మాపూర్‌ రూరల్‌/గన్నేరువరం/ ఇల్లం తకుంట : మానకొండూర్‌ నియోజకవర్గంలోని ప్రతీ ఎక రం పచ్చపడేందుకు కాలువల నిర్మా ణం చేపట్టామని, కాళేశ్వరం నీటితో ప్రతి మడిని తడిపేందుకు సీఎం కేసీఆర్‌ సంకల్పంతో ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పేర్కొన్నారు. మండలంలోని మల్లాపూర్‌ గ్రామంలో సాగునీటి నూతన కాలువ పనులను, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన గురువారం ప్రారంభించారు. గన్నేరువరం మండలంలో పారువెల్ల పెద్ద చెరువు మత్తడి వద్ద కాళేశ్వర జలాలకు సర్పంచ్‌ తీగల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం అనంతారం చెరువుకు అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి కాలువ ద్వారా నీటి విడుదల చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల ఎమ్మె ల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముం దుకు సాగుతున్నామన్నారు. ఇప్పటికే తోటపల్లి నుంచి బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లోని 47చెరువులు నింపామన్నారు. తిమ్మాపూర్‌, మానకొండూర్‌, కేశవపట్నం మండలాల్లోని 16వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు కొత్త కాలువలను ప్రారంభించామన్నారు. ప్రణాళికలు, భూ సేకరణ పనులు ప్రారంభించగా రైతులు సానుకూలంగా స్పందించారన్నారు. రెండు, మూ డు నెలల్లోనే పనులు పూర్తి చేస్తామని చెప్పారు. కాలువల కోసం ఇప్పటికే 90శాతం భూసేకరణ పూర్తయిందని, చెంజర్ల లో 5ఎకరాలు, నల్లగొండలో 2ఎకరాలతో భూసేకరణ పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ కాలువ నిర్మాణాలను సాఫీగా సాగేందుకు రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులందరూ సహకరించాలని కోరారు. ఇల్లంతకుంట మండలంలోని ప్రతి గ్రామ చెరువును కాళేశ్వరం జలాలతో నింపడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అన్నపూర్ణ, రంగనాయక సాగర్‌ ప్రాజెక్టుల ద్వారా ఇల్లంతకుంట, బెజ్జంకి, గన్నేరువరం మండలాలోని పలు గ్రామాల్లోని చెరువులు ఇప్పటికే అలుగులు దుకుంతున్నాయన్నారు. మండుటెండలో కూడా కాళేశ్వరం జలాలతో చెరువులు అలుగులు దుంకేందుకు కృషి చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. గన్నేరువరం మండలంలోని 15 వేల ఎకరాలు కాళేశ్వర జలాలతో సాగులోకి రానున్నాయని, ఎమ్మెల్యే రసమయి పేర్కొన్నారు. మండలంలోని చెరువులు నింపి సాగు నీరందించేందుకు రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని, మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా, పారువెల్ల పెద్ద చెరువు మత్తడి వద్ద పండుగ వాతావరణం కనిపించింది. గ్రామస్తులు, మహిళలు పెద్ద సం ఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్‌ చైర్మన్‌ సిద్దం వేణు, ఎంపీపీలు లిం గాల మల్లారెడ్డి, ఉట్కూరి వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సుధగోని శ్రీనా థ్‌గౌడ్‌, పీఏసీఎస్‌ చైర్మన్లు అల్వాల కోటి, తిరుపతిరెడ్డి, అనంతరెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ చింతపల్లి వేణురావు, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు బద్దం తిరుపతిరెడ్డి, గొడుగు తిరుపతి, మాజీ జడ్పీటీసీ జువ్వాడి మన్మోహన్‌రావు, బెజ్జంకి సహకార సంఘం మాజీ చైర్మన్‌ చింతలపెల్లి రవీందర్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌ చైర్మన్‌ రాజిరెడ్డి, జిల్లా డైరెక్టర్‌ మాధవరెడ్డి, డీఈ దేవేందర్‌, ఏఈ సమరసేన, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు చల్ల నారాయణ, నాయకులు న్యాత సుధాకర్‌, ఎలాటి చంద్రారెడ్డి, గూడూరి సురేశ్‌, గొల్లపెల్లి రవి, బూర వెంకటేశ్వర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


logo