శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - May 28, 2020 , 05:25:01

జగిత్యాల జిల్లాలో 12 పాజిటివ్‌ కేసులు

జగిత్యాల జిల్లాలో 12 పాజిటివ్‌ కేసులు

  • మొత్తం 54 కేసులు..
  • ముంబై వలస కార్మికులే 48 మంది...

జగిత్యాల: జగిత్యాల జిల్లాలో బుధవారం రికార్డు స్థాయిలో పన్నెండు కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ పుప్పాల శ్రీధర్‌ తెలిపారు. ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులను క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు చేయడంతో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ముంబై నుంచి జగిత్యాల జిల్లాకు ఇప్పటివరకు 5,600 వేల మంది వలస కార్మికులు రాగా, వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్‌లో ఉంచారు. మహారాష్ట్రలోని ముంబై నుంచి రాగా క్వారంటైన్‌లో ఉంచి వైద్య పరీక్షలు బుధవారం చేయగా, పన్నెండు మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని చికిత్స కోసం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. జిల్లాలో ఇప్పటి వరకు 54 మంది బారిన పడగా నలుగురు డిశ్చార్జ్‌ అయ్యారు. 48 యాక్టివ్‌ కేసులున్నాయి. పాజిటివ్‌ కేసుల్లో 48 మంది ముంబై వలస కార్మికులే కావడం గమనార్హం. బుధవారం కరోనా సోకిన వారిలో మేడిపల్లి మండలంలో 3, మల్యాల మండలంలో 6, గొల్లపల్లి మండలంలో 1, కోరుట్ల 1, కథలాపూర్‌ మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. వీరిలో ఆరేళ్ల పాప కూడా ఉంది. logo