మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Karimnagar - May 27, 2020 , 02:57:38

‘తోటపల్లి’నుంచి నీటి విడుదలపై మంత్రి ఈటల సమీక్ష

‘తోటపల్లి’నుంచి నీటి విడుదలపై మంత్రి ఈటల సమీక్ష

గన్నేరువరం:  తోటపల్లి రిజర్వాయర్‌ నుంచి నీటి విడుదలపై హైదరాబాద్‌లోని జలసౌధలో మంత్రి ఈటల రాజేందర్‌ అధ్యక్షతన మంగళవారం సమీక్షా సమావేశం  జరిగింది.  ఈ సమావేశానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తోటపల్లి ప్రాజెక్టు నుంచి రెండు నెలలకుగాను మొత్తం 16 వేల ఎకరాలకు నీరందిస్తామని పేర్కొన్నారు.  ఇందులో గన్నేరువరం మండలంలోని 15 వేల ఎకరాలకు నీరందించేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.  ఇందుకోసం రూ.30 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అడిగిన వెంటనే నిధులిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.  కార్యక్రమంలో ప్రత్యేక కార్యదర్శి రతన్‌ కుమార్‌, ఈఎన్సీ మురళీధర్‌, ఎస్‌ఈ అనిల్‌, డీఈలు తదితరులు పాల్గొన్నారు.logo