శనివారం 19 సెప్టెంబర్ 2020
Karimnagar - May 27, 2020 , 02:54:52

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ పరీక్షలు

కొనసాగుతున్న స్క్రీనింగ్‌ పరీక్షలు

కరీంనగర్‌ హెల్త్‌ : ముంబై నుంచి చొప్పదండికి వచ్చి న వ్యక్తి కుటుంబంలోని ఒకరికి  కరోనా పాజిటివ్‌ వ చ్చిన నేపథ్యంలో మంగళవారం చొప్పదండిలో 8 వైద్య బృందాలు స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించాయి. 414 గృహాలను సందర్శించి 1716 మందికి   పరీక్షలు  చేశారు. 60 సంవత్సరాలు పైబడిన 171 మం ది వృద్ధులు, 42 మంది చక్కెర వ్యాధిగ్రస్తులు, 78 మంది అధిక రక్తపోటు ఉన్న వారిని గుర్తించి వారికి తగు జాగ్రత్తలు చెప్పినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. ముంబైతో పాటు ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారికి క్వారంటైన్‌ ముద్రలు వేశామని పేర్కొన్నారు. అలాగే జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలైన అల్ఫోర్స్‌ జూనియర్‌ కళాశాల వద్ద 176, లయోలా కాలేజీ వద్ద 81 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు. టెలీమెడిసిన్‌  ద్వారా జిల్లా నుంచి 11 మందికి ఉచిత వైద్య సలహాలు అందించినట్లు తెలిపారు.


logo