శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Karimnagar - May 27, 2020 , 02:52:13

‘సమగ్ర సాగు’పై నేటి నుంచి అవగాహన సదస్సులు

‘సమగ్ర సాగు’పై నేటి నుంచి అవగాహన సదస్సులు

మెట్‌పల్లి రూరల్‌: నియంత్రిత పంటల సాగులో భాగంగా మెట్‌పల్లి మండలంలో క్లస్టర్ల వారీగా ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులకు సమగ్ర సాగు విధానంపై ఈనెల 27 నుంచి 29 వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మండల వ్యవసాయాధికారి షాహిద్‌ అలీ మంగళవారం తెలిపారు. 27న ఉదయం జగ్గసాగర్‌ క్లస్టర్‌ పరిధిలోని జగ్గసాగర్‌, ఆత్మకూర్‌, ఆత్మనగర్‌, కొండ్రికర్ల, కోనరావుపేట, పాటిమీది తం డా, మధ్యాహ్నం మెట్‌పల్లి క్లస్టర్‌ పరిధిలోని మెట్‌పల్లి, రేగుంట, చౌలమద్ది, పెద్దాపూర్‌, రామారావుపల్లె, ఆరపేట గ్రామాలకు అవగాహన సదస్సు ఉంటుందన్నారు. 28న ఉదయం వెల్లుల్ల క్లస్టర్‌ పరిధిలోని వెల్లుల్ల, వేంపేట, చింతలపేట, రామచంద్రంపేట, మాసాయిపేట, మధ్యాహ్నం బండలింగాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోని బండలింగాపూర్‌, రాజేశ్వర్‌రావుపేట, సత్తక్కపల్లి, మేడిపల్లి, చెర్లకొండాపూర్‌, వెంకట్రావుపేట గ్రామాల వారికి సద స్సు ఉంటుందని పేర్కొన్నారు. 29న మెట్లచిట్టాపూర్‌ క్లస్టర్‌ పరిధిలోని మెట్లచిట్టాపూర్‌, విట్టంపేట, రామలచ్చక్కపేట, రంగారావుపేట, కేసీఆర్‌ తండా, ఏఎస్సార్‌ తండాకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఆ గ్రామాల సర్పంచులు, ఎం పీటీసీ సభ్యులు, రైతు సమన్వయ సమితి సభ్యు లు హాజరుకావాలని ఏవో సూచించారు.

పెగడపల్లి: నియంత్రిత పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు మండలంలో బుధ, గురువారాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు మం డల వ్యవసాయ విస్తరణ అధికారి అశోక్‌ తెలిపా రు. ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొనాలన్నారు.


logo