సోమవారం 21 సెప్టెంబర్ 2020
Karimnagar - May 27, 2020 , 02:52:20

తొలకరి కోసం చూడాల్సిన పని లేదు

తొలకరి కోసం చూడాల్సిన పని లేదు

  ప్రభుత్వ సూచనల మేరకు పంటలు వేయాలి

 ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

రాయికల్‌ రూరల్‌ : కాళేశ్వరం, ఎస్సారెస్పీలో పుష్కలంగా నీరు ఉండడంతో తొలకరి జల్లుల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే పంటలు వేసుకోవచ్చని ఎమ్మెల్యే సంజయ్‌ కుమా ర్‌ రైతులకు సూచించారు. ధర్మాజీపేటలో నియంత్రిత సాగు విధానంపై వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన రైతు అవగాహన సదస్సులో మంగళవారం ముఖ్య అతిథిగా పాల్గొ ని మాట్లాడారు. రామాజీపేటలో  ఫీడర్‌ చానెల్‌ ఏర్పాటు చేసేందుకు లోడి స్వచ్ఛంద సంస్థ ముందుకు రావడం అభినందనీయమన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో 62 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తున్న కాలువల ను ఉపాధిహామీ ద్వారా మరమ్మతు చేపడుతున్నామన్నారు. అధిక దిగుబడి కోసమే నియంత్రిత వ్యవసాయంపై ప్రభుత్వం మొగ్గుచూపుతున్నదన్నారు. ఆ దిశగా రైతులు సమాయత్తం కావాలని కోరారు. రైతుల ఆర్థిక ఎదుగుదలకు ప్రభు త్వం అహర్నిశలు కృషి చేస్తున్నదన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణే  లక్ష్యంగా ముఖ్య మంత్రి కేసీఆర్‌ ప్రణాళికాబద్ధంగా ముందుకు సా గుతున్నారన్నారు. పని కావాలని అడిగిన ప్రతి ఒక్కరికీ జాబ్‌ కార్డు ఇచ్చి రోజుకు రూ. 230 ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్య సంధ్య, మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, వైస్‌ ఎంపీపీ మ హేశ్వరరావు, సర్పంచులు జక్కుల చంద్రశేఖర్‌, స్నేహలత, బెజ్జంకి రమాదేవి పాల్గొన్నారు.


logo