శనివారం 30 మే 2020
Karimnagar - May 24, 2020 , 00:37:39

వేసవితానం.. ఉపశమనం

వేసవితానం.. ఉపశమనం

నాలుగైదు రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 9గంటల నుంచే దంచుతున్నాయి. మధ్యాహ్నం కల్లా మంటపుట్టిస్తున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పైపైకి చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో గరిష్ఠంగా 47 డిగ్రీలు నమోదు కాగా, వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలు తట్టుకోలేక కూలర్లు, ఏసీల కింద సేదతీరుతున్నారు. తప్పని పరిస్థితుల్లో బయట పనిచేసే కార్మికులు మాత్రం అల్లాడిపోతున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్‌ ప్రాంతంలో ముగ్గురు కార్మికులు ఇలా తానాలు చేస్తూ ఉపశమనం పొందారు. 

ఫొటో : స్టాఫ్‌ఫొటోగ్రాఫర్‌, కరీంనగర్‌logo