బుధవారం 27 మే 2020
Karimnagar - May 22, 2020 , 01:00:16

సంరక్షణ.. సన్నద్ధం

సంరక్షణ.. సన్నద్ధం

జూన్‌ 8 నుంచి పది పరీక్షలు

కొవిడ్‌-19 నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

ఓవైపు కరోనా నివారణ.. మరో వైపు ఎగ్జామ్స్‌ 

ఉమ్మడి జిల్లాలో అదనంగా 179 సెంటర్లు 

భౌతిక దూరం పాటించేలా చర్యలు  

శానిటైజేషన్‌.. థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్టులు

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8 నుంచి మళ్లీ మొదలు కాబోతున్నాయి. కరోనా నేపథ్యంలో ‘సంరక్షణ..సన్నద్ధం’ అన్నట్లుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. అన్ని జిల్లాల్లో విద్యార్థులు భౌతిక దూరం పాటించేందుకు యంత్రాంగం అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. ఇదే సమయంలో విద్యార్థులకు సమాచారం చేరవేయడంతోపాటు వైరస్‌ కట్టడికి చర్యలు చేపడుతున్నది. పాత, కొత్త కేంద్రాలను పూర్తి స్థాయిలో శానిటైజేషన్‌ చేయడంతోపాటు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నది.

కరీంనగర్‌ ప్రతినిధి,నమస్తే తెలంగాణ: 2019-20 విద్యా సంవత్సరంలో భాగంగా గత మార్చి 19న పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం ఏప్రిల్‌ 8 వరకు జరుగాల్సి ఉంది. మార్చి 21న హిందీ పరీక్ష ముగియగానే.. కొవిడ్‌-19 నేపథ్యంలో పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగిలిన పరీక్షలను నిర్వహించడానికి వీలు లేకుండా పోయిం ది. వరుసగా లాక్‌డౌన్‌ పొడిగింపు కావడం.. కరో నా బాధితులు పెరుగుతూ వస్తున్న నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణ వాయిదా పడుతూ వచ్చిం ది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చిన నేపథ్యంలో.. పరీక్షలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం హైకోర్టును కోరగా.. జూన్‌ 8 నుంచి నిర్వహించుకోడానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకోసం కొన్ని షరతులను విధించింది. కోర్టు ఆదేశాల ప్రకారం పరీక్షలు నిర్వహించడానికి అధికాయంత్రాగం సిద్ధమవుతున్నది. 

భారీగా పెరిగిన కేంద్రాలు.. 

కరోనా నియంత్రణ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల ను దాదాపు రెట్టింపు చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో గతంలో 219 పరీక్షా కేంద్రాలు ఉండగా.. అదనంగా మరో 179 ఏర్పాటు చేశారు. అలాగే, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొదట 190 ఉండగా మరో 135 కేంద్రాలను పెంచారు. విద్యార్థికీ విద్యార్థికి మధ్య భౌతిక దూరం ఉండేందుకు కేంద్రాల సంఖ్యను పెంచారు. గతంలో పరీక్ష రాసిన కేంద్రాలకు సమీపంలోనే కొత్త కేంద్రాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇదే సమయంలో.. పాత హాల్‌టికెట్లతో పరీక్షలు జరుపుతామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినందున ఇబ్బంది ఉండదు. అయితే హైకోర్టు సూచనల మేరకు పరీక్ష.. పరీక్షకు మధ్య రెండు రోజులు గడు వు ఉండాలి. ఈ లెక్కన జూన్‌ 8న పరీక్షలు ప్రారంభమై.. పూర్తి కావడానికి సెలవులతో కలిపి సుమారు 25 రోజులు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే పరీక్షకు ముందు.. పరీక్ష తదుపరి శానిటైజేషన్‌ చేయడంతోపాటు అవసరమైన థర్మ ల్‌ స్క్రీనింగ్‌ కిట్లు, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. 


logo