బుధవారం 03 జూన్ 2020
Karimnagar - May 21, 2020 , 00:44:13

రోణికి ముందే అగ్గి

రోణికి ముందే అగ్గి

  • ఉమ్మడి జిల్లాలో   భగ్గుమంటున్న భానుడు
  • ఉదయం 9 దాటితేనే ఎండ
  • రోజురోజుకూ మరింత ప్రతాపం
  • ఈ నెల మొదటి నుంచే 40 డిగ్రీల పైనే 

రోహిణి కార్తెకు నాలుగు రోజుల ముందు నుంచే భానుడు మండుతున్నడు. ఉదయం తొమ్మిది గంటలకే ప్రతాపం చూపిస్తున్నడు. మధ్యాహ్నం వేళ అగ్గి కురిపిస్తున్నడు. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. తాజాగా బుధవారం ఉగ్రరూపం దాల్చడంతో కరీంనగర్‌ జిల్లాలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఫ్యాన్లు, కూలర్లు నడిచినా వడగాలులు, ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నరు.   

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: ఎండలు దంచి కొడుతున్నాయి. రోహిణీ కార్తె సమీపిస్తున్న నేపథ్యంలో హీటెక్కిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు 41, 42 డిగ్రీలు మాత్రమే ఉన్న ఎండ ఒక్కసారిగా పెరగడంతో కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరి బిక్కిరయ్యారు. కరీంనగర్‌లో బుధవారం గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరుకున్నాయి. ఇక జగిత్యాలలో 45.6, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42, పెద్దపల్లి జిల్లాలో 43.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. అసలే కరోనా లాక్‌డౌన్‌ ఆపై ఎండల తీవ్రత కారణంగా పగలు ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటికి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం వరకు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతోంది. రోహిణీ కార్తెలో రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయనే నానుడికి తగినట్లుగా ఈ కార్తి ప్రవేశించక ముందే ఉష్ణోగ్రతల తీవ్రత కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలే కాకుండా రాత్రి వేళలోనూ ఎండ వేడిమి ప్రతాపం చూపుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఎండ తగ్గినా వేడి తగ్గక పోవడం ఇందుకు నిదర్శనం. దీంతో రాత్రి, పగలనే తేడా లేకుండా జనాలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలను ఆశ్రయించక తప్పడం లేదు.. బయటకు వెళ్తున్నవారు శీతలపానీయాలు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.

వడదెబ్బతో ఇద్దరి మృతి..

జమ్మికుంటరూరల్‌(ఇల్లందకుంట)/సారంగా పూర్‌:  వడదెబ్బకు ఇద్దరు మృతిచెందారు. ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన పరకాల తిరుపతి (45), జగిత్యాల జిల్లా సా రంగపూర్‌ మండలం కోనాపూర్‌లో పశువుల కాపరి గుర్రం చిన్నయ్య (55) వడదెబ్బతో మృతి చెందాడు.   తిరుపతి బుధవారం ఉద యం గడ్డిని తగులబెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. మధ్యాహ్నం వరకు ఎండలో అక్కడే ఉండడంతో వడదెబ్బ తగిలి పొలంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. చుట్టుపక్కలవారు గమనించి దవాఖానకు తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మరణించాడు. మృ తుడికి భార్య రేణుక, ఇద్దరు పిల్లలు ఉ న్నారు. సారంగాపూర్‌ మం డలం    కొనాపూర్‌  శివారులోని వ్యవసాయ బావివద్దకు గుర్రం చిన్నయ్య రోజుమాదిరిగా మేత కోసం పశువులను తీసుకెళ్లాడు. మధ్యాహ్నం ఎండవేడిమికి తాళలేక మరణించాడు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజయ్య తెలిపారు.logo