శనివారం 30 మే 2020
Karimnagar - May 19, 2020 , 02:09:37

ప్రతి చెరువునూ నింపాలి

ప్రతి చెరువునూ నింపాలి

చొప్పదండి : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని చెరువులను కాళేశ్వరం జలాలతో నింపేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసరమైన చెరువులకు తూములు, కాలువల నిర్మాణం కోసం నివేదికలను సిద్ధం చేయాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని ప్రతి చెరువునూ నింపడంతోపాటు చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చూడడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే గంగాధర మండలం నారాయణపూర్‌ జలాశయం, కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువు, పోతారం చెరువు ద్వారా వివిధ గ్రామాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఎల్లంపల్లి ఎడమ, కుడి కాలువల నిర్మాణంపై పూర్తి నివేదిక అందించాలని చెప్పారు. నియోజకవర్గంలో 14 తూములు మంజూరయ్యాయని, ఇంకా అవసరముంటే తెలియజేయాలని సూచించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో గతంలోకంటే 40వేల ఎకరాల్లో వరిసాగు విస్తీర్ణం పెరిగిందని, వేసవిలోనూ చెరువులు మత్తడి దూకడం ముఖ్యమంత్రి కేసీఆర్‌ భగీరథ ప్రయత్నానికి నిదర్శనమని కొనియాడారు. ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు దూలం బాలాగౌడ్‌, రాజనర్సింగారావు, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, మాజీ ఎంపీపీలు గుర్రం భూంరెడ్డి, మార్కొండ కిష్టారెడ్డి, నాయకులు పుల్కం నర్సయ్య, లక్ష్మణ్‌ ఉన్నారు. 

అభివృద్ధి పనులకు భూమి పూజ

కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాలలో డీఎంఎఫ్‌టీ నిధులు రూ.4లక్షల60వేలతో నిర్మించనున్న మేర సంఘ భవనానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ భూమిపూజ చేసి, పనులు ప్రారంభించారు. మండల కేంద్రానికి చెందిన రైతు తిరుపతిరెడ్డి పొలాన్ని పరిశీలించారు. ఆయన వెంట జడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, వైస్‌ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ మేన్నేని రాజనర్సింగరావు, పులి వెంకటేశం, గడ్డం లక్ష్మారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి ఉన్నారు. 


logo