సోమవారం 01 జూన్ 2020
Karimnagar - May 16, 2020 , 03:12:31

పనులు త్వరగా పూర్తి చేయాలి

పనులు త్వరగా పూర్తి చేయాలి

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: గ్రామాల్లో ఉపాధి పనులను ఎక్కువగా గుర్తించి పెద్ద సంఖ్యలో ప్రజలను భాగస్వాములను చేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శశాంక ఆదేశించారు. కలెక్టరేట్‌ కార్యాలయంలో శుక్రవారం ఆయన ఉపాధిహామీ, పల్లె ప్రగతి, హరితహారంపై అన్ని మండలాల ఎంపీడీవోలు, ఎంపీవో, ఏపీవో, టీఏలు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రతిరోజూ పనులను పర్యవేక్షించాలని, గ్రామాల్లో ప్రజలు ఈజీఎస్‌ పనులకు ఎక్కువ సంఖ్యలో వెళ్లేలా ప్రోత్సహించాలని ఎంపీవోలను ఆదేశించారు.  నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటేందుకు ఇద్దరు ఆర్డీవోలు డివిజన్‌వారీగా అవసరమైన భూములు గుర్తించి సిద్ధం చేయాలన్నారు. అలాగే, మండలస్థాయిలో మొక్కలు నాటేందుకు తహసీల్దార్లు ప్రాంతాలను గుర్తించాలన్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌లాల్‌, జడ్పీ సీఈవో వెంకటమాధవరావు, డీఆర్డీవో వెంకటేశ్వర్‌రావు, ఏపీడీ మంజులాదేవి, డీపీవో రఘువరన్‌, తదితరులున్నారు.logo