గురువారం 28 మే 2020
Karimnagar - May 15, 2020 , 01:48:36

మేమున్నామనీ.. నీకేం కాదని!

మేమున్నామనీ.. నీకేం కాదని!

  • మానవత్వం చాటిన కొలనూర్‌వాసులు
  • రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడికి సాయం

ఓదెల : రోడ్డు ప్రమాదానికి గురై అచేతనంగా మారిన యువకుడికి ఆ గ్రామస్తులంతా అండగా నిలిచారు. ఆపద సమయంలో ‘మేమున్నా’మంటూ మానవత్వాన్ని చాటారు. ఓదెల మండలం కొలనూర్‌ గ్రామానికి చెందిన సిరిసేటి అనిల్‌, ఈ నెల 11న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతుండగా, పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చవుతున్నాయి.  ఆ నిరుపేద గీత కార్మిక కుటుంబానికి భారంగా మారాయి. ఈ క్రమంలో తమ కొడుకును బతికించుకునేందుకు దాతల సాయం కోరుతూ ‘కొలనూర్‌ వాట్సాప్‌ గ్రూప్‌'లో అనిల్‌ తండ్రి చిన రాజయ్య పోస్ట్‌ పెట్టగా, గ్రామ ప్రజలు, యువకులు, వ్యాపారులు స్పందించారు. దాదాపు రూ.లక్ష దాకా ఆన్‌లైన్‌ ద్వారా సాయం అందించారు. మరికొందరు చేయూతనందించేందుకు ముందుకు వస్తున్నారు. ఆపదలో ఉన్న గ్రామ యువకుడిని ఆదుకునేందుకు కొలనూర్‌ ప్రజలు చూపిన ఔదార్యం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నది. 


logo